అనూష్క హీరోయిన్ గా నిన్న రిలీజయిన అరుంధతి..ఎలా ఉంది అంటే...మరో మాట లేకుండా అద్భతం అంటున్నారు. రెండు రోజులు లేటయినా మంచి కలెక్షన్స్,ఓపినింగ్స్ సంపాదిస్తోంది. ముఖ్యంగా డ్రమ్ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వస్తోందని చెప్తున్నారు. తెలుగు తెరపై గతంలో ఎప్ప్పుడూ చూడని గ్రాఫిక్స్ చూసామని ప్రేక్షకులు ఆనందపడుతున్నారు. అలాగే దర్శకుడు కోడి రామకృష్ణ మళ్ళి అమ్మోరు సినిమా తర్వాత తన విశ్వరూపం చూపించి మంచి విజువల్ ట్రీట్ గా మలిచారని సినీ వర్గాలు ఆ సీనియర్ ని మెచ్చుకుంటున్నారు. మరి కొంతమంది అయితే ఈ క్రెడిట్ మొత్త ఎంత ఖర్చయినా ఫరవాలేదు..అనుకున్నట్లు రావాలని రెండేళ్ళపాటు ఎడతెరపి లేకుండా శ్రమించి,డబ్బు పెట్టిన నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి గట్స్ ని ఆకాశానికి ఎత్తుతున్నారు. మొత్తానికి సంక్రాంతి వెళ్తూ మంచి హిట్ ఇచ్చింది. ఆ రకంగా మంచి ఓపినింగ్ తో ఈ సంవత్సరం ప్రారంభమయినట్లే.