సొమ్ము శ్యామ్ ప్రసాద్ రెడ్డిది..సోకు అనుష్కది
సొమ్ము ఒకరిది..షోకు మరొకరది అనే సామెత అనూష్క విషయంలో నిజం అవుతోంది. తాజాగా తెలుగులో సెన్సేషన్ సృష్టించిన అనూష్క 'అరుంధతి' చిత్రం ఇప్పుడు కేరళలోనూ రిలీజ్ కానుంది. మళయాళ భాషలోకి డబ్బింగ్ చేసిన వెర్షన్ ను సంక్రాంతి కానుకగా అక్కడ రిలీజ్ చేయనున్నారు. తమిళంలో ఆ మధ్య అరుంధతి రిలీజై ఓకే అనిపించుకుంది. అయితే రెవిన్యూ పరంగా పెద్దగా వర్కవుట్ కాకపోయినా అనూష్కకు మాత్రం మంచి ఆఫర్స్ తెచ్చిపెట్టింది. అలాగే కేరళలోనూ ఇది విడుదలై మంచి పేరు తెచ్చుకుంటే అక్కడా తన ప్రతిభా ప్రదర్శన చేయవచ్చుననీ అనూష్క ఎదురుచూస్తోంది. సొమ్ము ఖర్చుపెట్టి రిలీజ్ చేసేది శ్యామ్ ప్రసాద్ రెడ్డి అయితే ఆ తర్వాత ఆఫర్స్ పొందేది అనూష్క పని అవుతోంది. దాంతో కేరళలో ఈ చిత్రం ఏ మేరకు విజయం సాధిస్తుందని శ్యామ్ ప్రసాద్ చూస్తుంటే..అనూష్క రిలీజ్ అయి కాస్త మంచి పేరు తెచ్చుకుంటే చాలని చూస్తోంది. ఎవరి ఆలోచన వారిది..ఎవరి ఫ్రాఫిట్స్ వారివి..


Click it and Unblock the Notifications











