twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అరుంధతి బంపర్ ఆఫర్ నందుల పంట

    By Sindhu
    |

    'వదల బొమ్మాళి....వదల" అంటూ తన సాంకేతిక మాయాజాలంతో ప్రేక్షకులను కట్టిపడేసిన..'అరుంధతి" నంది అవార్డులను సిరులుగా తలచి, ఏకంగా పది నందులను నందివర్ధనాలుగా తన సిగలో తురుముకుని, 2008 నంది పురస్కారాల రేసులో మేటిగా నిలిచింది. విమర్శకుల ప్రశంసలను అందుకున్న 'గమ్యం" సినిమా ఉత్తమ చిత్రం అవార్డును దక్కించుకుంది. ఉత్తమ నటుడుగా రవితేజ (నేనింతే), నటిగా స్వాతి (అష్టాచమ్మా) నందులను గెలుచుకున్నారు. తన తొలి చిత్రం 'గమ్యం"తోనే జాగర్లమూడి రాధాకష్ణ (క్రిష్) ఉత్తమ దర్శకుడి పురస్కారాన్ని దక్కించుకున్నారు. 2008 సంవత్సారానికిగాను నంది చలన చిత్ర పురస్కారాలను నంది ఫిల్మ్ అవార్డుల కమిటి చైర్మన్ తమ్మారెడ్డి భరద్వాజ ఆధ్వర్యంలోని జ్యూరీ బృందం ప్రతినిధులు సచివాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. మొత్తం ఏడు విభాగాల్లో అవార్డుల ఎంపిక కోసం ఎంట్రీలు స్వీకరించామని, జ్యూరీ ప్రతినిధులు పలుమార్లు సమావేశమై అన్ని కోణాలను క్షుణ్ణంగా పరిశీలించి ఉత్తమమైన వాటిని అవార్డులకు ఎంపిక చేశారని ఆంద్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టీవి, రంగస్థల అభివృద్ది సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పార్థసారథి తెలిపారు.

    డిసెంబరు మొదటి వారంటో ప్రభుత్వం ఈ పురస్కారాలను నవంబర్ లో ప్రకటిస్తామన్నారు. ఉత్తమ ద్వితీయ చిత్రంగా కృష్ణుడు హీరోగా సాయి కిరణ్ అడవి దర్శకత్వంలో సరితా పట్రా నిర్మించిన 'వినాయకుడు' ఎంపికైంది. అవార్డు కింద రజిత నంది, 20వేల నగదు అందజేస్తారు. తృతీయ చిత్రంగా భాస్కర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన 'పరుగు' ఎంపికైంది. దీనికి గాను కాంస్య పతకం, 10వేల నగదు అందిస్తారు. సకుటుంబ కథా చిత్రంగా 'అష్టాచమ్మ' చిత్రానికి అక్కినేని అవార్డు లభించింది. రజిత నంది, 20వేల నగదు అందిస్తారు. రామ్ మోహన్ నిర్మాతగా ఇంద్రగంటి మోహన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఉత్తమ పాపులర్ చిత్రంగా శ్రీనువైట్ల దర్శకత్వంలో స్రవంతి రవికిషోర్ నిర్మించిన 'రెడీ' ఎంపికైంది. దీనికి గాను నిర్మాతకు స్వర్ణనంది, 50 వేల నగదు అందజేస్తారు. ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రంగా నందిరెడ్డి నరసింహారెడ్డి నిర్మించిన '1940లో ఒక గ్రామం' ఎంపికైంది. ఇందుకు గాను స్వర్ణనంది, 50వేల నగదు అందజేస్తారు. ఉత్తమ బాలల చిత్రంగా ఏదీ ఎంపిక కాలేదు. ద్వితీయ ఉత్తమ బాలల చిత్రంగా 'దుర్గి', ద్వితీయ ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రంగా 'మేమూ మనుషులమే', ద్వితీయ ఉత్తమ విద్యా విషయక చిత్రంగా ఆళ్ల రాంబాబు నిర్మించిన 'అడవి నా తల్లిరో' ఎంపికైంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X