సూపర్ హిట్ అరుంధతి హిందీ రీమేక్ హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ప్రముఖ సంస్ధ యష్ రాజ్ ఫిలిమ్స్ వారు ఈ చిత్రం రైట్స్ తీసుకుంటున్నారని సమాచారం. ఇక అనూష్క చేసిన పాత్రకు కాజోల్ ని కాని రాణి ముఖర్జనీ గాని అడిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే అమితాబ్ బచ్చన్ ను..తెలుగులో షాయీజి షిండే చేసిన విలన్ పాత్రకు అడుగుతున్నారని చెప్తున్నారు. ఆయన గొంతు ఓ రకమైన హిప్నాటిజం ప్రేక్షకుల్లో క్రియేట్ చేస్తుందని కాబట్టి ఆయన్ను అడుతున్నారని తెలుస్తోంది. ఇక ఈ ప్రాజెక్టుని అంతర్జాతీయ స్ధాయిలో మార్కెటింగ్ చేయాలని వారు యోచిస్తున్నారని సమాచారం. మొత్తానికి తెలుగు అరుంధతి ప్రపంచాన్ని పలకరించే సమయం దగ్గర పడుతోందన్నమాట.