అనుష్క టైటిల్ పాత్రలో కోడి రామకృష్ణ రూపొందిస్తున్న హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రం 'అరుంధతి'. షూటింగ్ ప్రారంభమై దాదాపు రెండు సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికి రిలీజ్ కాలేదు. సినిమాలో గ్రాఫిక్స్ ఎక్కువగా ఉండటం వలన లేటవుతోందని దసరా కి రిలీజ్ చెయ్యటానికి ప్లాన్ చేస్తున్నామని నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి అంటున్నారు. ఆయన ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకుని ఉన్నారు. ఈ చిత్రంలో అనుష్క పాత్ర హైలెట్ అయ్యి అమ్మోరు లో సౌందర్య పాత్రలా సినీ చరిత్రలో నిలబడి పోతుందని అంటున్నారు. ఇక గతంలోనూ చిరంజీవితో చేసిన అంజి కూడా గ్రాఫిక్స్ తో లేటయింది.