Just In
- 17 min ago
ట్రెండ్ అవుతున్న సరిలేరు నీకెవ్వరు సాంగ్.. బన్నీని వెనక్కి నెట్టి!
- 28 min ago
అబ్బురపరిచిన సూపర్ స్టార్.. తెలుగు సినీ పరిశ్రమ నుంచి మహేష్ బాబు ఒక్కడే..
- 55 min ago
Ala Vaikunthapurramloo భారీ రేటుకు హక్కులు...చక్రం తిప్పిన థమన్!
- 1 hr ago
ప్రభాస్ కోసం బరిలోకి శంకర్, దిల్ రాజు! దెబ్బకు రేంజ్ డబుల్..!!
Don't Miss!
- Sports
మూడో టీ20: మార్పులతో బరిలోకి టీమిండియా.. తుది జట్టు ఇదేనా?!!
- News
70 ఏళ్ల వయసు ఉన్నా..25 ఏళ్ల ఉత్సాహంతోనే :150 మందికి సమాధానం చెబుతా: సభలో చంద్రబాబు ఫైర్..!
- Finance
FASTag: హైదరాబాద్లో పార్కింగ్ ఫీజు చెల్లించకుండానే వెళ్లొచ్చు!! పెట్రోలుకు కూడా
- Lifestyle
కడుపు ఎడమ వైపు నొప్పికి గల కారణాలు ఏమిటి?ఈ నొప్పి ప్రమాదకరమా?
- Technology
చైనా సంస్థలతో జట్టు కట్టేందుకు వ్యూహాలు రచిస్తున్న ఇంటెక్స్
- Automobiles
2020 స్కోడా ర్యాపిడ్ టీజర్ ఫోటోలు.. అసలైన మోడల్ ఇలా ఉంటుంది
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
సినిమా హాళ్ళలోనే ఎందుకు? అక్కడ జాతీయగీతం ఎందుకు వెయ్యరు??: నటుడు అరవింద్ స్వామి ప్రశ్న
దేశభక్తి, జాతీయతా భావాలు ప్రతి పౌరుడిలో నిండి ఉండాలంటే జాతీయగీతాన్ని ఆలపించాల్సిన అవసరం ఎంతయినా ఉంది, దేశం పట్ల ఆరాధనా భావం, పూజనీయమైన భావం పెరిగేలా చేసేందుకు మన దేశ జాతీయగీతం ప్రతిరోజు సినిమా హాళ్లలో వినిపించాల్సిందే అంటూ గత సంవత్సరం జాతీయగీతంపై ఈ రోజు సుప్రీంకోర్టు పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ నిర్ణయం పట్ల రకరకాల అభిప్రాయాలు మొదలయ్యాయి. ఒక సంవత్సరం పాటు ఈ పద్దతిని చూసిన తర్వాత. సుప్రీం కోర్టు మళ్ళీ పునరాలోచనలో పడింది.


జాతీయ గీతం
సినిమా థియేటర్లలో జాతీయ గీతం సందర్భంగా తప్పకుండా నిల్చోవాల్సిందేననే నిబంధనకు సుప్రీంకోర్టు సవరణ చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే సినిమా హాళ్లలో జాతీయగీతం ప్రదర్శితమవుతున్న సమయంలో ప్రేక్షకులు తమ దేశభక్తిని నిరూపించుకునేందుకు కచ్చితంగా లేచి నిలబడాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది.

నిబంధనలను సవరించాలి
సినిమా వేయడానికి ముందు జాతీయగీతం ప్రసారానికి సంబంధించిన నిబంధనలను సవరించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కేంద్రానికి సూచించింది. ఈ ధర్మాసనంలో జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్ సభ్యులుగా ఉన్నారు.

అరవింద్ స్వామి
అయితే మళ్ళీ ఈ సంధర్భంలో కూడా మళ్ళీ చర్చ మొదలు కావటంతో నటుడు అరవింద్ స్వామి కి మంట నశాలానికి అంటినట్టుంది. "గవర్నమెంట్ ఆఫీసులు - కోర్టులు - అసెంబ్లీలు - పార్లమెంటు హాలులో రోజూ జాతీయ గీతం ఎందుకు ఆలపించరు. వినోదం కోసం ఉన్న సినిమా హాళ్లలోనే జాతీయ గీతం వినిపించడం ఎందుకు తప్పనిసరి చేశారు?'' అంటూ ట్విట్టర్ వేదికగా తన సందేహం వ్యక్తం చేశాడు అరవిందస్వామి.

దానిని గొప్పగౌరవంగా భావిస్తా
జాతీయ గీతం అంటే గౌరం ఉన్నంత మాత్రాన ఎక్కడ పడితే అక్కడ సమయం సందర్భం లేకుండా పదే పదే ఆ గీతాన్ని ప్రసారం చేయటం సరైనదా? అన్న ఉద్దేశ్యం లోనే ఈ ప్రశ్న అడిగాడని అర్థం కావటానికి మళ్ళీ ఇంకో వివరణ కూడా ఇచ్చాడు. "జాతీయగీతం ఎప్పుడు వినిపించినా నేను లేచి నుంచుంటాను. నా తోటివారితో కలిసి గొంతు కలిపి జాతీయగీతం ఆలపిస్తా. దానిని గొప్పగౌరవంగా భావిస్తా'' అంటూ జనగణమన పట్ల తనకున్న గౌరవభావాన్ని కూడా ఇదే ట్వీట్ లో స్పష్టంగా చెప్పాడు.

మీ దేశభక్తిని నిరూపించుకోండి అంటూ
సో రోజుకు నాలుగుసార్లు నిలబడితేనే దేశభక్తి అనేది ఉన్నట్టు కాదనీ, జాతీయగీతాన్ని సినిమా హాళ్ళలో వేసి "మీ దేశభక్తిని నిరూపించుకోండి అంటూ టెస్ట్ పెట్టటమూ సరికాదనీ అరవింద్ స్వామి చెప్పాడన్న మాట. అరవిందస్వామి డౌట్ కూడా చాలా ఇంటెలిజింట్ గా ఉంది.

పొద్దున్నే జాతీయ గీతం వినిపించటం
నిజమే..! పని మధ్యలో అవినీతీ, లంచాలు లాంటి విషయాలు గుర్తు రాకుండా మన నాయకులకూ, అధికారులకూ పొద్దున్నే జాతీయ గీతం వినిపించటం ఫలితాన్నివ్వవచ్చు అంటూ ఒక అభిమాని తన అభిప్రాయాన్ని వెలి బుచ్చాడు. ... చట్టాలు చేసేవారు.. దానిని అమలు చేసేవారు రోజూ జాతీయ గీతం ఎందుకు ఆలపించరంటూ అతడు వ్యక్తం చేసిన డౌట్ అందరినీ ఆలోచింపజేసేదే.. అతడి డౌట్ కు మిగతా వాళ్లు ఎలా రెస్పాండవుతారో చూడాలి..