ఆర్య-2 'ఆక్రందన'
అల్లు అర్జున్ కెరీర్ కు మంచి బ్రేక్ ఇచ్చి, తన కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచిన చిత్రం ఆర్య. సుకుమార్ దర్శకత్వం వహించారు. ఇప్పుడా చిత్రానికి కొనసాగింపుగా అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ఆర్య-2. మగధీర సినిమాలో తన అందం, అభినయంతో ఆకట్టుకున్న కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. నవదీప్, శ్రధ్దాఆర్య మరో జంటగా నటిస్తున్నారు. సుకుమార్ ఆస్థాన సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నరు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న ఈ చిత్రం సెప్టెంబరులో విడుదలయే అవకాశాలున్నాయి.
కాగా ఇప్పుడు టైటిల్ విషయంలో బన్ని సుముకంగా లేడని సమాచారం. అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ ఆక్రందన అనే పేరును పరిశీలిస్తున్నట్టు ఫిలింనగర్ న్యూస్. రెండు టైటిల్లూ 'ఆ' తోనే మొదలవ్వడం యాదృచ్చికమా లేక సెంటిమెంటా? ఏదైతేనేం ఇదే నిజమైతే ఆర్య ఆక్రందనని మనం చూడబోతున్నాం.


Click it and Unblock the Notifications











