ఆర్య-2 రిలీజ్ కి రామ్ చరణ్ అడ్డం?
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న ఆర్య-2 చిత్రం నవంబర్ పదకొండున గానీ పదమూడన కానీ రిలీజయ్యే అవకాశముందని సమచారం. అయితే ఇప్పటికే దాదాపు అంతా పూర్తయిపోయినా ఎందుకీ ఆలస్యం అని అల్లు అర్జున్ అభిమానులలోనే కాక పరిశ్రమ వర్గాలలోనూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ చిత్రం రిలీజ్ ని ఓ స్ట్రాటజీ ప్రకారమే చేస్తున్నట్లు తెలుస్తోంది.రామ్ చరణ్ తేజ హీరోగా చేసిన మగధీర వంద రోజులు పూర్యయ్యేదాకా రిలీజ్ చేయకూడదని నిర్ణయించారు. ఎందుకంటే ఆర్య-2 బయ్యర్స్ లో చాలా మంది మగధీర ని కొనుక్కున్నవారే. దాంతో ఆర్య-2 ముందే రిలీజ్ చేస్తే టెమ్ట్ అయి తమ ధియోటర్స్ నుండి మగధీరను తీసేసే అవకాశం ఉంది. ఆ ప్లేసులో ఆర్య-2 వేసేస్తారు. దాంతో వందరోజుల పండుగకు ఇబ్బంది వస్తుంది. మరో ప్రక్క రామ్ చరణ్ అభిమానులు గొడవలూ చేయవచ్చు. అందులోనూ కొత్తగా కలిపిన సీన్స్ వల్ల మగధీర కలెక్షన్స్ మళ్ళీ పుంజుకున్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే రిలీజ్ ని వాయిదా వేసారు.


Click it and Unblock the Notifications











