అల్లు అర్జున్ చిత్రం రీరిలీజ్..ఫ్యాన్స్ పండగ
కాలికట్ : కేరళలో అల్లు అర్జున్ కి క్రేజ్ విపరీతంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపద్యంలో తాజాగా అక్కడ అల్లు అర్జున్ చిత్రాలను రీరిలీజ్ చేస్తున్నారు. ఆర్య 2 చిత్రంతో ఈ హవా ప్రారంభమైంది. కాలికట్ ..కల్పన థియోటర్ లో ...సంక్రాంతి కి విడుదలైన అలెక్స్ పాండ్యన్ తమిళ వెర్షన్ తీసేసి ఆర్య2 మళయాళి వెర్షన్ వేసారు. మిగతా థియోటర్స్ లోకూడా త్వరలో ఈ చిత్రాన్ని వేయనున్నట్లు సమాచారం. దాంతో అక్కడ అల్లు అర్జున్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
అక్కడ అల్లు అర్జున్ ఏ రేంజిలో డిమాండ్ పెరిగిందంటే..ఆ మధ్యన ఓ గార్మెంట్ షో రూం ఓపినింగ్ ఫంక్షన్ కి వెళ్లారు. కొట్టాయంలో ఉన్న ఇమ్మాన్యూయల్ సిల్క్ వారు అల్లు అర్జున్ ని పిలిచారు. గతంలో వారు షారూఖ్ ఖాన్ ని పిలిచి ఓపినింగ్ చేయించారు. అప్పుడు కొచ్చిలో ఈ షోరూం ఓపెన్ అయ్యింది. నాన్ మళయాళి స్టార్ ని పిలిచి ఓపెన్ చేయించటమేంటని అక్కడ సినీ పరిశ్రమ విస్తుపోయి చూస్తోంది. వారు అల్లుఅర్జున్ వసూళ్లుని, ఆ క్రేజ్ ని చూసి గుర్రుమంటున్నారు.
ఈ నేపధ్యంలో కింగ్ ఈవెంట్స్ మేనేజర్ శేఖర్ మాట్లాడుతూ...అల్లు అర్జున్ కి మళయాళంలో విపరీతమైన ప్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే అతన్ని పిలుస్తున్నాం అని చెప్పారు. ఇక అల్లు అర్జున్ చిత్రాలన్నీ అక్కడ డబ్ అయ్యి బాగా ఆడుతున్నాయి. అక్కడ టీవీ ఛానెల్స్ లో అల్లు అర్జున్ సినిమాలు కంటిన్యూగా వేస్తూంటారు. ప్రస్తుతం అల్లు అర్జున్.. పూరీ జగన్నాధ్ దర్సకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. గణేష్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం బ్యాంకాక్ లో షూటింగ్ జరుపుకుంటోంది.అక్కడ నోట్ పుస్తకాలపై అల్లు అర్జున్ ఫోటోలు వేసి అమ్ముతున్నారు. అంబలాధ్ ప్రొడక్టు వారు ఈ ఫోటోలు వేసి అమ్మటంతో అవి హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. అక్కడ కుర్రాళ్లలో అల్లు అర్జున్ అంటే అంతగా ఆసక్తి నెలకొని ఉంది. నిర్మాతలు కూడా అల్లు అర్జున్ తో సినిమా అనగానే కేరళ మార్కెట్ ను కూడా దృష్టిలో పెట్టుకుని పెట్టుబడులు పెడుతున్నారు. ఇక ఈ అల్లు అర్జున్ ఫోటోతో పుస్తకాలు అమ్మటం అక్కడ మీడియాను సైతం ఆకర్షించింది. వారు ఈ పుస్తకాలపై ప్రత్యేక కథనాలు ప్రసారం చేసారు. తాము తొలి విడత ప్రింటు చేసిన పుస్తకాలు అయ్యిపోయాయని కొత్త స్టాక్ కోసం ఎదురుచూస్తున్నామని చెప్తున్నారు పబ్లిషర్లు.
అల్లు అర్జున్ సినిమాలుకు కూడా అక్కడ మంచి మార్కెట్ ఉంది. ఇక వివి వినాయిక్ దర్శకత్వంలో రూపొందిన బద్రీనాధ్ చిత్రం ఇక్కడ ఫ్లాఫ్ టాక్ తెచ్చుకుంది. అయితే కేరళలో మంచి రేటుకే ఈ చిత్రం అమ్ముడయినట్లు తెలుస్తోంది. గతంలోనూ అల్లు అర్జున్ చిత్రాలు ఆర్య, హ్యాపీలు అక్కడ ఘన విజయం సాధించాయి.


Click it and Unblock the Notifications












