‘లీకేజి’ చిక్కుల్లో చిక్కుకొన్న అల్లు అర్జున్
అల్లు అర్జున్ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా ఆదిత్య ఆర్ట్స్ బ్యానర్ పై ఆదిత్యబాబు, బోగపల్లి నిర్మిస్తున్న 'ఆర్య-2" సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. పరుగు, ఆర్య చిత్రాల తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రేక్షకుల ముందుకు రాకపోవడంతో ఆయన నటించిన ఆర్య2 చిత్రం విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ చివరి వారంలో ఆడియోను, అక్టోబర్ మొదటివారంలో సినిమా విడుదలకు నిర్మాతలు మొదట సన్నాహాలు చేశారు. అయితే ఇంతవరకూ అవేవి ఆచరణలోకి రాలేదు. ఇప్పుడు ఈ సినిమాకి డబ్బింగ్ చిక్కులు కూడా తలెత్తాయంటూ ఫిల్మ్ నగర్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఆర్య-2 సినిమా కొంత కాలంగా లీకేజీ సమస్యలు ఎదుర్కొంటోంది. మొదట ఈ సినిమాలోని రెండు పాటలు వెబ్ సైట్లకు లీకయ్యాయి. కొద్దిదోజుల క్రితం లోగోతో సహా రెండు పోస్టర్లు లీక్ కావడం కూడా చర్చనీయాంశమైంది.
ఫోటోలు లీకైన గంటల్లోనే డ్యామేజ్ కంట్రోల్ కోసం నిర్మాత అధికారికంగా సినిమా డిజైన్ప్ మీడియాకు రిలీజ్ చేశారు. ఈ డిజైన్స్ ఇప్పుడు అందరి దష్టిని ఆకట్టుకుంటూ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచుతున్నాయి. అయితే తనకు చెప్పకుండా డిజైన్ప్ చేయడం వల్ల అల్లు అర్జున్ కొంత వెనుకంజు వేస్తున్నారని, దీంతో డబ్బింగ్ ప్రొసెస్ కూడా జాప్యమవుతోందనీ సినీ వర్గాల బోగట్టా. మరోవైపు తనకు రావాల్సిన రెమ్యునరేషన్ బకాయిలు ఉన్నాయంటూ సుకుమార్ సైతం అలిగారట. దాంతో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఆలస్యంగా సాగుతున్నాయని అంటున్నారు. అయితే మగధీర తర్వాత మళ్ళీ బాక్పాఫీస్ ను శాసించిన సినిమాలు ఏవీ రానందున 'ఆర్య-2" ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ఇదే మంచి అవకాశమని చెప్పొచ్చు.


Click it and Unblock the Notifications











