ఆర్య 2 విడుదల 27న, అయినా సందేహమే!
దర్శకుడు సుకుమార్ పేరు నిజ జీవితంలో తగినదే. కానీ ఆయన సినిమాల్ల్లో తలలు ఎగిరి పడుతుంటాయి. ఆర్య-2 ను ఆయన ప్రతిష్టాత్మకంగా రూపొందించిన విషయం తెలిసిందే. ఆ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని అందరూ ఎదురు చూస్తుండగా నిర్మాత ఆదిత్య బాబు నవంబర్ 25 న విడుదల చేస్తున్నామని ప్రకటించారు.
కానీ తాజా సమాచారం ప్రకారం ఆ సినిమాను నవంబర్ 27 న విడుదల చేయనున్నారు. దానికి కూడా ఏదైనా అవాంతరముంటే చెప్పలేం. సుకుమార్ సినిమాలకు సంబంధించి ఏ నిముషానికి ఏం జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే సినిమా రిలీజ్ పై గతంలో దట్స్ తెలుగు రాసిన కథనమిద.ఈ చిత్రం రిలీజ్ ని ఓ స్ట్రాటజీ ప్రకారమే చేస్తున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ తేజ హీరోగా చేసిన మగధీర వంద రోజులు పూర్యయ్యేదాకా రిలీజ్ చేయకూడదని నిర్ణయించారు. ఎందుకంటే ఆర్య-2 బయ్యర్స్ లో చాలా మంది మగధీర ని కొనుక్కున్నవారే. దాంతో ఆర్య-2 ముందే రిలీజ్ చేస్తే టెమ్ట్ అయి తమ ధియోటర్స్ నుండి మగధీరను తీసేసే అవకాశం ఉంది. ఆ ప్లేసులో ఆర్య-2 వేసేస్తారు. దాంతో వందరోజుల పండుగకు ఇబ్బంది వస్తుంది. మరో ప్రక్క రామ్ చరణ్ అభిమానులు గొడవలూ చేయవచ్చు. అందులోనూ కొత్తగా కలిపిన సీన్స్ వల్ల మగధీర కలెక్షన్స్ మళ్ళీ పుంజుకున్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే రిలీజ్ ని వాయిదా వేసారు.


Click it and Unblock the Notifications











