ఆర్య-2 నిర్మాత హీరోగా చలాకి చిత్రం
ఆర్య-2,జగడం చిత్రాల నిర్మాత ఆదిత్య బాబు తాజాగా కన్నడంలో చలాకీ అనే చిత్రంలో హీరోగా చేస్తున్నారు. మాదేష్ అనే కన్నడ దర్శకుడు ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో ఆదిత్య బాబు సరసన రోమా హీరోయిన్ గా చేస్తోంది. ఇంతకు ముందు ఆడువారి మాటలకు అర్ధాలే వేరులో చిత్రాన్ని కన్నడంలో రీమేక్ చేసి హీరోగా చేసి విజయం సాధించాడు ఆదిత్య బాబు. గుడుంబా శంకర్,నమ్మ బసవ చిత్రాల దర్శకుడు వీర్ శంకర్ ఆ చిత్రాన్ని డైరక్ట్ చేసాడు. ఇక ఈ చలాకి చిత్రం కథ లేడీస్ కాలేజీలోకి ఓ కుర్రాడు ప్రవేశిస్తే వచ్చే సమస్యలు తో వినోదాత్మకంగా సాగుతుందని తెలుస్తోంది. సంక్రాంతి కి రిలీజయ్యే ఈ చిత్రం ఓ సాంగ్ బ్యాలన్స్ ఉంది. ఇక హీరోగానే కాక ఆదిత్య బాబు కన్నడంలో పునీత్ రాజకుమార్ తోనూ, శివరాజ కుమార్ తోనూ చిత్రాలు నిర్మిస్తున్నారు.
ఆదిత్య బాబు ఆర్య-2 అల్లు అర్జున్ సుకుమార్ చలాకి ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే aditya babu jagadam chalaki maadesh arya-2 allu arjun


Click it and Unblock the Notifications