సెప్టెంబర్ 19న ఆర్య-2?
అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్, నవదీప్, శ్రద్ధా దాస్, నాయకానాయికలుగా సుకుమార్ దర్శకత్వంలో బోగవల్లి ప్రసాద్, ఆదిత్యాబాబులు సంయుక్తంగా నిర్మిస్తున్న 'ఆర్య2" చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబర్ 19న విడుదల కాబోతుందని తెలుస్తోంది. అప్పటికి 'మగధీర" విడుదలై 50 రోజులు పూర్తవుతుంది. ఒకే ఇంట్లో ఇద్దరు హీరోలు పోటీ పడకూడదే వుద్ధేశ్యంతో 'ఆర్య-2" విడుదల వాయిదా పడింది. ఈ చిత్రాన్ని గతంలో అల్లు అర్జునే కథానాయకుడుగా సాఫ్టవేర్ ఇంజనీర్ పాత్రలో నటించగా సుకుమార్ దర్శకత్వంలో రూపొంది ఘనవిజయం సాధించిన 'ఆర్య" చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ మొదటి సారి అల్లు అర్జున్ సరసన నటిస్తుండగా 'చందమామ" చిత్రంలో కాజల్ సరసన నటించిన నవదీప్ ఈ చిత్రంలో మరో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఆయనకు జోడీగా శ్రద్ధాదాస్, నటిస్తోంది.


Click it and Unblock the Notifications











