For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్: హీరో ఇంట్లో సంబరాలు.. అంకుల్ అయ్యానని విశాల్ ట్వీట్

  |

  సినీ ఇండస్ట్రీలో ప్రేమ వివాహాలు చాలా సాధారణంగా జరిగే విషయాలే అన్నది తెలిసిందే. కానీ, వయసులో 17 ఏళ్ల తేడా ఉన్నా ప్రేమకు దానితో సంబంధం లేదని నిరూపించారు స్టార్ కపుల్ కోలీవుడ్ హీరో ఆర్య, హీరోయిన్ సాయేషా సైగల్. చాలా కాలం పాటు ప్రేమాయణం సాగించిన తర్వాత వీళ్లిద్దరూ పెళ్లి పీటలు ఎక్కారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. దీంతో ఈ స్టార్ హీరో కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తోంది. ఇక, ఈ విషయాన్ని మరో హీరో విశాల్ ముందుగా బయట పెట్టాడు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీ అందరి కోసం!

  సంచలనం అయిన సినీ జంట వివాహం

  సంచలనం అయిన సినీ జంట వివాహం

  'అఖిల్' అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన సాయేషా.. ఆ తర్వాత 'గజినీకాంత్' అనే మూవీలో ఆర్యతో కలిసి నటించింది. ఆ సమయంలోనే అతడితో ప్రేమాయణం సాగించింది. అప్పట్లో ఈ న్యూస్ సంచలన అయింది. దీనికి కారణం వీళ్లిద్దరికీ మధ్య ఏజ్ గ్యాప్ ఉండడమే. అయినప్పటికీ విమర్శలను పట్టించుకోని వీళ్లిద్దరూ పెళ్లి పీటలెక్కారు. ఇది దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.

  చిరంజీవిలా మారిపోయిన నిహారిక భర్త: ఆ సినిమాను రీక్రియేట్ చేస్తూ.. పోస్టర్లు వదిలిన మెగా డాటర్

  పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సాయేషా

  పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సాయేషా

  2019లో ఆర్య.. సాయేషా సైగల్‌కు వివాహం జరిగింది. అప్పటి నుంచి ఎంతో అన్యోన్యంగా ఉంటూ సందడి చేస్తున్నారు. పెళ్లి తర్వాత కూడా ఇద్దరూ కెరీర్లను చక్కగా నడుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సాయేషా సైగల్ ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. చెన్నైలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో ఆమె డెలివరీ జరిగింది. ప్రస్తుతం తల్లి, బిడ్డా క్షేమంగా ఉన్నారని తెలుస్తోంది.

  Varun Tej's Ghani సెట్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. బ్రదర్ ఎక్కడ అంటూ నెటిజన్ల ఆరా!

  అక్కడ సాయేషా... హైదరాబాద్‌లో ఆర్య

  అక్కడ సాయేషా... హైదరాబాద్‌లో ఆర్య

  ప్రస్తుతం ఆర్య 'ఎనిమీ' అనే సినిమాలో విశాల్‌తో కలిసి నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కోసం అతడు గర్భవతి అయిన భార్యను వదిలేసి కొద్ది రోజులుగా హైదరాబాద్‌లోనే ఉంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో సాయేషాకు శుక్రవారం రాత్రి పురిటి నొప్పులు వచ్చాయని తెలిసింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించగా.. ఆడబిడ్డకు జన్మనిచ్చిందని సమాచారం.

  అంకుల్ అయ్యానని హీరో విశాల్ ట్వీట్

  అంకుల్ అయ్యానని హీరో విశాల్ ట్వీట్

  సాయేషాకు బిడ్డ పుట్టిన విషయాన్ని ముందుగా హీరో విశాల్ వెల్లడించాడు. ఆర్యతో కలిసి షూటింగ్‌లో పాల్గొంటోన్న అతడు.. 'ఈ వార్తను రివీల్ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. నా సోదరుడు ఆర్య, సాయేషా ఆడబిడ్డకు జన్మనిచ్చారు. అంకుల్‌ను అయినందుకు హ్యాపీ. షూటింగ్ మధ్యలో చెప్పలేని అనుభూతి కలిగింది. బిడ్డకు దేవుడి ఆశీర్వాదం ఉండాలి' అంటూ ట్వీట్ చేశాడు.

  స్టార్ డాటర్ అందాల విందు: ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన హీరోయిన్.. మతి పోగొట్టే ఫోజులతో రచ్చ

  ఇద్దరూ కలిసి ఆ సినిమాలో నటించారు

  ఇద్దరూ కలిసి ఆ సినిమాలో నటించారు

  సాయేషా సైగల్ తెలుగు సినిమా ద్వారా పరిచయం అయినా.. ఆ తర్వాత దక్షిణాదిలోని మిగిలిన భాషల్లో బిజీ అయిపోయింది. ఈ క్రమంలోనే చివరిగా ఆమె తన భర్తతో కలిసి 'టెడ్డీ' అనే సినిమాలో నటించారు. ఆ తర్వాత ఆమె బ్రేక్ తీసుకోగా.. ఆర్య మాత్రం వరుస చిత్రాలు చేస్తున్నాడు. ఇటీవలే అతడు నటించిన 'సార్పట్టా' అనే మూవీ విడుదలై మంచి రెస్పాన్స్‌ను అందుకుంది.

  English summary
  Tamil Hero Arya married Actress Sayyesha Saigal in 2019. Now the couple has been blessed with a baby girl earlier today in Chennai
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X