బూతు సినిమా రీమేక్‌లో...ఆర్య, హన్సిక, అంజలి!

By Bojja Kumar

చెన్నయ్ : హిందీలో సంచనల విజయం సాధించిన చిత్రం'ఢిల్లీ బెల్లీ'. ఈ చిత్రం కేవలం పెద్దలకు మాత్రమే పరిమితమైన బూతు సినిమా. ఈ చిత్రంలో బూతులున్నాయి జాగ్రత్త అంటూ అప్పట్లో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కూడా ప్రకటించారు. తాజాగా ఈ చిత్రం ఇప్పుడు తెలుగు, తమిళ భాషల్లో నిర్మాణమవుతోంది.

'ఢిల్లీ బెల్లీ' చిత్రాన్ని నిర్మించిన 'యూ టీవీ మోషన్ పిక్చర్స్' సంస్థనే ఇప్పుడు ఈ రెండు భాషల్లో కూడా పునర్నిర్మిస్తోంది. ఆర్య, హన్సిక, అంజలి ముఖ్య తారలుగా కన్నన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. తెలుగు వెర్షన్ కు 'నాటీ బాయ్స్'గా పేరును నిర్ణయించినట్లు యూ టీవీ సౌత్ ఫిల్మ్స్ ఇంచార్జ్ జి. ధనుంజయన్ తెలిపారు.

మణిరత్నం సినిమాలకు పని చేసిన కన్నన్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. హిందీ మాతృతకకు పలు మార్పులు చేసి, దక్షిణాది నేటివిటీకి అనుకూలంగా ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికి ఈచిత్రం 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందని, గత నెలలో స్విట్జర్లాండ్ లో ఆర్య-హన్సికల మీద ఒక పాటను, ఆర్య-అంజలి మీద మరో పాటను చిత్రీకరించినట్లు ఆయన పేర్కొన్నారు.

రెండున్నర గంటలపాటు ఆద్యంతం నవ్వించేలా ఈ చిత్రం ఉటుందని ధనుంజయన్ తెలిపారు. సంతానం, అలీ, ప్రేమ్ జీ, నాజర్ ఈ చిత్రంలో ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తమిళంలో తన పాత్రకు అలీనే డబ్బింగ్ చెప్పుకుంటున్నారట. తమన్ ఈచిత్రానికి సంగీతం సమకూర్చుతున్నారు. మొత్తం ఇందులో 5 పాటలు ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X