హీరో ఆర్యతో రేపు నయనతార పెళ్లి, నయన పీఆర్ఓ మీడియా ప్రకటన

By Bojja Kumar

హైదరాబాద్ : హీరోయిన్ నయనతార తమిళ హీరో ఆర్యను పెళ్లి చేసుకోబోతున్నట్లు తన పిఆర్వో ద్వారా మీడియాకు వెల్లడించింది. రేపు(మే 11) రాత్రి వీరి వివాహం జరుగుతుందని వెల్లడించినట్లు పలు టీవీ ఛానళ్లలో వార్తలు వెలువడ్డాయి. అయితే వివాహ వేదిక ఎక్కడ అనే విషయం మాత్రం వెల్లడించలేదు. అయితే కొన్ని ఛానల్స్ మాత్రం ఇదంతా పబ్లిసిటీ స్టంటే అని ఆ వార్తలను కొట్టి పారేస్తున్నాయి. రేపటి వరకు ఈ వార్తలపై ఓ క్లారిటీ రానుంది. గత నెల కూడా వీరిద్దరు పూణె చర్చిలో రహస్య వివాహం చేసుకున్నట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.

గతంలో నయనతార తమిళ హీరో శింబుతో ప్రేమాయణం సాగించిన సంగతి తెలిసిందే. వారు పీకల్లోతు ప్రేమలో మునిగారనడానికి నిదర్శనంగా ఇంటర్నెట్లో వారి ముద్దు సన్నివేశాలు కూడా దర్శనమిచ్చాయి. శింబుతో విడిపోయిన తర్వాత ప్రభుదేవాతో జతకట్టిన నయన అతనితో పెళ్లి వరకూ వెళ్లింది.

నయన ప్రేమలో పడి ప్రభుదేవా తన భార్య రమాలత్‌కు విడాకులు ఇవ్వడంలో అప్పట్లో పెద్ద దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఏమైదో తెలియదు కానీ చివరి నిమిషంలో అభిప్రాయ విబేధాలు వచ్చి ప్రభుదేవాతోనూ తెగదెంపులు చేసుకుంది. ప్రభుదేవా కోరిక మేరకు మతం మార్చుకోవడంతో పాటు, సినిమాలకు టాటా చెప్పిన నయన, అతనితో విడిపోయాక మళ్లీ సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది.

తాజాగా నయనతార ఆర్యతో వివాహానికి సిద్దం అవ్వడం, అతన్ని పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించడం హాట్ టాపిక్ అయింది. మరి ఆర్యతో నయనతార బంధం ఎన్నాళ్లు కొనసాగుతుందో? చూడాలి.

హీరో ఆర్యతో రేపు నయనతార పెళ్లి

ఆర్య, నయనతార పలు తమిళ చిత్రాల్లో కలసి నటించారు

హీరో ఆర్యతో రేపు నయనతార పెళ్లి

ఇటీవల ఆర్య నయనతార నటిస్తున్న సెట్స్ కు వచ్చి ఆమెతో చాలా సేపు గడిపాడట.

హీరో ఆర్యతో రేపు నయనతార పెళ్లి

అంతటితో ఆగకుండా చాలా మంది దర్శక నిర్మాతలకు నయనతార‌ను తీసుకోవాల్సిందిగా రికమండ్ చేస్తున్నాడు ఆర్య.

హీరో ఆర్యతో రేపు నయనతార పెళ్లి

గతంలో ఈ ఇద్దరు కలిసి బాస్ ఎంగిర భాస్కరన్ అనే చిత్రంలో కలిసి నటించారు. అప్పుడే ఈ ఇద్దరి మధ్య ఎఫైర్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి.

హీరో ఆర్యతో రేపు నయనతార పెళ్లి

అయితే నయనతారతో తాను డేటింగ్ చేస్తున్నట్లు వస్తున్న వార్తలను ఆర్య ఖండిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X