Don't Miss!
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Finance ITC: ఐటీసీ ఇన్వెస్టర్లకు శుభవార్త.. !
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నయనతార 'నేనే అంబానీ' చిత్రం ఏమైంది?
ఆర్య, నయనతార కాంబినేషన్ లో తమిళంలో రూపొంది సూపర్ హిట్టైన 'బాస్ ఎన్గిర భాస్కరన్' చిత్రం డబ్బింగై 'నేనే అంబానీ' గా ఈ శుక్రవారం విడుదలైంది. నయనతారకి తెలుగులో ఉన్న క్రేజ్ ని నమ్మి అనువదించి ధియోటర్స్ లో దించిన ఈ చిత్రం ఎవరినీ ఆకట్టుకోలేకపోతోంది. అందులోనూ అల్లు అర్జున్ వరుడు చిత్రంలో విలన్ గా చేసిన ఆర్య ఈ చిత్రంలో హీరో కావటం మైనస్ గా మారింది. ఇక కథలో బాస్ అలియాస్ ...భాస్కరన్(ఆర్య) భాద్యతలంటే ఆమడదూరం పారుపోయే బ్యాచ్. ఎప్పుడూ ఎంజాయ్ మెంట్ లోనే గడిపే భాస్కర్ డిగ్రీ కూడా ప్యాస్ కాలేకపోతాడు.
ఎలాగైనా పాస్ కావాలని కాపీ కొడుతూ ట్రైనీ ప్రొఫెసర్ గా వచ్చిన చంద్రిక(నయనతార) కు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతాడు. దొరికిందే తడువుగా ఆమెతో ప్రేమలో పడిపోతాడు. అక్కడ నుండి ఈ పరిక్ష గొడవ వలిలేసి చంద్రిక వెనకపడుతూ ప్రేమ అని పడుతూంటాడు. ఈ లోగా భాస్కర్ అన్న, చంద్రిక అక్క ప్రేమించి పెళ్ళిచేసుకుంటారు. ఆ పెళ్ళి తరువాత భాస్కర్ కూడా చంద్రికను పెళ్ళిచేసుకోవాలనుకుంటాడు. అప్పుడు చంద్రికతో పాటు అతని ఫ్యామిలీలో ఎవరూ కూడా ఆ పెళ్ళికి ఒప్పుకోరు.
అప్పుడు భాస్కర్ ఆరునెలల్లోగా నేను అంబానీ అయి చూపిస్తా అని అందరితో చాలెంజ్ చేస్తాడు. ఆ తర్వాత దాన్ని ఎలా నెరవేర్చుకున్నాడనేది మిగతా కథ. కథ, కధనం కామిడీగా రూపొందించిన ఈ చిత్రం చూడ్డానికి బాగానే ఉన్నా ఓపినింగ్స్ కూడా రాబట్టుకోలేకపోయింది. ప్రమోషన్ కూడా పెద్దగా లేకపోవటం, డబ్బింగ్ కూడా ఆకట్టుకునే రీతిలో లేకపోవటం ఈ చిత్రానికి సమస్యగా మారాయి.
జీవా ప్రత్యేక పాత్రలో నటించిన ఈ చిత్రంలో లక్ష్మి, చిత్ర లక్ష్మణన్, విజయలక్ష్మి, సంతానం, పంజు సుబ్బు తారాగణం. ఈ చిత్రానికి మాటలు: శశాంక్ వెన్నెలకంటి, పాటలు: భువనచంద్ర, వెన్నెలకంటి, కెమెరా: శక్తి శరవణన్, కూర్పు: వివేక్, కళ: జాక్సన్, నృత్యాలు: దినేష్, ఫైట్స్: రాజశేఖర్, దర్శకత్వం: రాజేష్.ఎం.