ఆర్యన్ ఖాన్‌తో అజ్ఞాత వ్యక్తి సెల్ఫీ.. షారుక్ కొడుకు అరెస్ట్ వెనుక కీలకంగా మిస్టరీ మ్యాన్.. రాజకీయ నేతల భగ్గు

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ తర్వాత ఆయనతో గుర్తు తెలియని వ్యక్తి సెల్ఫీ దిగడం అత్యంత వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. అయితే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) కార్యాలయంలో ఆర్యన్ ఖాన్‌తో దిగిన వ్యక్తిని కేసవీ గోసవిగా గుర్తించారు. అయితే ఎన్సీబీ ఆఫీస్‌లో గోసవికి ఏం పని? ఆర్యన్ ఖాన్‌తో ఎందుకు ఫోటో దిగాడు? అతడికి ఈ దర్యాప్తుతో పనేంది అనే ప్రశ్నలు ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయ నేతలు లేవనెత్తుతున్నారు. ఈ వివాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

ఎవరీ కేవీ గోసవి?

ఎవరీ కేవీ గోసవి?

ఆర్యన్ ఖాన్‌తో ఎన్సీబీ ఆఫీస్‌లో సెల్పీ దిగిన కేపీ గోసవి ఓ ప్రైవేట్ డిటెక్టివ్. క్రూయిజ్‌లో జరుగుతున్న డ్రగ్స్ పార్టీపై ఎన్సీబీ అధికారులు దాడులు వ్యవహరించే సమయంలో ప్రైవేట్ డిటెక్టివ్‌గా కేవీ గోసవి కీలక పాత్రను పోషించారని అధికారులు స్పష్టం చేశారు. ఆర్యన్ ఖాన్‌ చేతిని పట్టుకొని ఎన్సీబీ కార్యాలయంలోకి వెళ్తున్న ఆయన ఫోటోలు మీడియాలో వైరల్ అయ్యాయి. దాంతో గోసవి వ్యవహారం వివాదంగా మారింది.

ఎన్సీబీతో కలిసి బీజేపీ ఉపాధ్యక్షుడు

ఎన్సీబీతో కలిసి బీజేపీ ఉపాధ్యక్షుడు

ఇదిలా ఉండగా, ఆర్యన్ అరెస్ట్ సమయంలో మహారాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు మనీష్ భనుషాలీ కూడా కనిపించారు. ఓడలో దాడుల సమయంలో మనీష్ అక్కడ ఉండటంపై నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత నవాబ్ మాలిక్ అభ్యంతరం లేవనెత్తారు. బీజేపీ నేతకు దాడుల సమయంలో అక్కడుండే అవసరం ఏమొచ్చింది. అంటూ ప్రశ్నించారు. మహారాష్ట్ర ప్రతిష్టను మంట కలిపేందుకు ఫేక్ డ్రగ్స్ కేసులతో బీజేపీ కుట్రపన్నుతున్నది అంటూ మాలిక్ ఆరోపించారు.

బీజేపీ, ఎన్సీబీ కుమ్మక్కైందంటూ

బీజేపీ, ఎన్సీబీ కుమ్మక్కైందంటూ

గతేడాదిగా మహారాష్ట్ర ప్రతిష్టపై బీజేపీ బురద జల్లుతుంది అంటూ ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ ఘాటుగా స్పందించారు. వీకే గోసవి, మనీష్ భనుషాలితో బీజేపీ కుమ్మక్కైంది. ఢిల్లీ, గుజరాత్‌లో మనీష్ ఎందుకు పర్యటిస్తున్నారు. ఎన్సీబీ దాడుల్లో వాళ్లు ఎందుకు పాల్గొన్నారు? ఎన్సీబీతో బీజేపీ కలిసి మహారాష్ట్ర గౌరవాన్ని మంటగలిపేందుకు కుట్రలు పన్నుతున్నది అని నవాబ్ మాలిక్ విమర్శించారు.

భారీ డ్రగ్స్ పార్టీ జరుగుతున్నదని..

భారీ డ్రగ్స్ పార్టీ జరుగుతున్నదని..

అయితే ఎన్సీపీ, ఇతర రాజకీయ నేతల విమర్శలను బీజేపీ నేత మనీష్ భునుషాలి ఖండించారు. ఆర్యన్ ఖాన్‌ అరెస్ట్‌తో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు. ముంబైలోని ఓడలో భారీ డ్రగ్స్ పార్టీ జరుగుతున్నదనే సమాచారం అక్టోబర్ 1వ తేదీన అందింది. ఈ దాడుల సమయంలో మరింత సమాచారం అందించడానికి ఎన్సీబీ అధికారులతో నేను ఉన్నాను అని మనీష్ భనుషాలీ తెలిపారు.

రాజకీయ నేతల ఆరోపణలను ఖండించిన ఎన్సీబీ

రాజకీయ నేతల ఆరోపణలను ఖండించిన ఎన్సీబీ


ముంబై నుంచి గోవాకు వెళ్లే క్రూయిజ్‌లో దాడుల అనంతరం జరిగిన అర్యన్ ఖాన్ అరెస్ట్‌కు వీకే గోసవి, మనీష్ భనుషాలి స్వతంత్ర సాక్షులు అని ఎన్సీబీ వెల్లడించింది. అయితే తమపై వస్తున్న ఆరోపణలను ఎన్సీబీ అధికారులు ఖండించారు. నిష్పక్షపాతంగా విచారణ చట్టబ్దదంగా, పారదర్శకంగా, ప్రొఫెషనల్ విధానంలో విచారణ జరుగుతున్నది అని ఎన్సీబీ అధికారి జీ సీంగ్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X