ఇవివి... మళ్లీ పుట్టారంటూ అల్లరి నరేష్ ట్వీట్
హైదరాబాద్ : సినీ నటుడు, ఇవివి తనయుడు ఆర్యన్ రాజేశ్ వివాహం సుభాషిణితో ఈ సంవత్సరం ఫిబ్రవరిలో వివాహం జరిగిన సంగతి తెలిసింతే. తాజాగా ఈ దంపతులు ఓ బాబు జన్మనిచ్చారు. డిసెంబర్ 1న వీరికి దాంపత్య ఫలం దక్కింది.
ఈ శుభ వార్తను రాజేష్ తమ్ముడు, స్టార్ కామెడీ హీరో అల్లరి నరేష్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 'ఇవివి గారు మళ్లీ పుట్టారు. మా అన్నావదినలు రాజేష్-సుభాషిని మగ బిడ్డకు జన్మనిచ్చారు. నాన్నగారే మళ్లీ పుట్టినట్లుంది. మా ఇంట మళ్లీ పుట్టిన ఇవివికి మీ అందరి ఆశీస్సులు కావాలి' అంటూ ట్వీట్ చేసాడు.
ఆర్యన్ రాజేష్ గురించిన వివరాల్లోకి వెళితే...హాయ్ చిత్రం ద్వారా తెరంగ్రేటం చేసి దాదాపు 10 చిత్రాల్లో నటించినా హీరోగా నిలదొక్కుకోలేక పోయాడు. దీంతో ఈ హీరో నటించడం మానేసి, నిర్మాతగా మారబోతున్నాడనే ప్రచారం ఫిల్మ్ నగర్లో సాగుతోంది. ఇక రాజేష్ తమ్ముడు అల్లరి నరేష్ గురించి కొత్తగా చెప్పాలిన పని లేదు.


Click it and Unblock the Notifications











