ఇవివి ఫ్యామిలీలోకి మరో బుల్లి పాపాయి (ఫోటో)
హైదరాబాద్: ఈవివి ఫ్యామిలీలోకి మరో బుల్లి పాపాయి వచ్చింది. ఆర్య రాజేష్ మళ్లీ తండ్రయ్యాడు. సంవత్సరం క్రితం బాబుకు జన్మినచ్చిన ఆర్యన్ రాజేష్ దంపతులు....జులై 14న పాపాయి(గర్ల్)కి జన్మనిచ్చారు. తాను మళ్లీ బాబాయ్ అయిన విషయాన్ని తెలియజేస్తూ అల్లరి నరేష్ తన సోషల్ నెట్వర్కింగులో ఫోటో పోస్టు చేసారు.
సినిమాల విషయానికొస్తే...
ప్రముఖ దర్శకుడు స్వర్గీయ ఇ.వి.వి సత్యనారాయణ స్థాపించిన 'ఇ.వి.వి సినిమా' సంస్థ బాధ్యతలను ఆయన తనయుడు ఆర్యన్ రాజేష్ స్వీకరించారు. ఆయన సారథ్యంలో 'ఇ.వి.వి సినిమా' సంస్థ నుండి వస్తున్న తాజా చిత్రం 'బందిపోటు'.
'అంతకు ముందు ఆ తర్వాత' చిత్రంతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో...అల్లరి నరేష్ హీరోగా 'బంధిపోటు' చిత్రం తెరకెక్కుతోంది. ఇ.వి.వి జయంతి సందర్భంగా జూన్ 10న ఈ చిత్రం మొదలై శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

ఆర్యన్ రాజేష్
‘బందిపోటు' చిత్రం ద్వారా ఇవివి పెద్ద కుమారుడు ఆర్యన్ రాజేష్ నిర్మాతగా మారారు. గతంలో ఆర్యన్ రాజేష్ ‘హాయ్' సినిమాతో పాటు పలు చిత్రాల్లో హీరోగా నటించిన సంగతి తెలిసిందే.

అల్లరి నరేష్
అల్లరి నరేష్ ప్రస్తుతం వివిధ ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నారు. ‘బంధిపోటు' సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

మోహన కృష్ణ ఇంద్రగంటి
ఇటీవల ‘అంతకు ముందు ఆ తర్వాత' చిత్రంతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ‘బందిపోటు' చిత్రం తెరకెక్కబోతోంది.

కామెడీ ఎంటర్టెనర్
‘బందిపోటు' చిత్రాన్ని పూర్తి వినోదత్మక చిత్రంగా, కామెడీ ప్రధానంగా తెరకెక్కిస్తున్నట్లు రాజేష్ తెలిపారు. త్వరలోనే ఈచిత్రానికి సంబంధించిన నటీనటులు మరి సాంకేతిక నిపుణుల వివరాలు తెలియజేస్తామని తెలిపారు. అల్లరి నరేష్ మార్కు కామెడీతో ఫ్యామిలీ ఎంటర్టెనర్‌గా ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











