ఆర్యన్ రాజేష్ నిశ్చితార్థ వేడుక
దివంగత దర్శకుడు ఇవివి సత్యనారాయణ కుమారుడు, నటుడు ఆర్యన్ రాజేష్ నిశ్చితార్థ వేడుక తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం జేగురుపాడులో సోమవారం ఘనంగా జరిగింది. ఈ గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ కంటిపూడి అమరనాథ్ కుమార్తె సుభాషిణిని రాజేష్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ వేడుకకు సినీ ప్రముఖులు అల్లరి నరేష్, ఉదయ కిరణ్, వెంకట్, బాలాజీ, చలపతిరావు, ఎల్.బి శ్రీరామ్, ఎంఎస్ నారాయణ, జీవా తదితరులతో పాటు జిల్లాకు చెందిన రాజకీయ నాయకులు మాగంటిబాబు, గోరంట్ల బచ్చయ్య చౌదరి తదితరులు హాజరయ్యారు.
ఇదిలా ఉంటే పెళ్లి ముందు రాజేష్ తన సన్నిహితులకు, స్నేహితులకు బ్యాచిలర్ పార్టీ ఇచ్చే ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. పిబ్రవరి 3న ఫిల్మ్ నగర్ క్లబ్ లో ఈ వేడుక ఉంటుందని సినీ వర్గాల సమాచారం.
హాయ్ చిత్రం ద్వారా తెరంగ్రేటం చేసిన రాజేష్ దాదాపు 10 చిత్రాల్లో నటించినా హీరోగా నిలదొక్కుకోలేక పోయాడు. దీంతో ఈ హీరో నటించడం మానేసి, నిర్మాతగా మారబోతున్నాడనే ప్రచారం ఫిల్మ్ నగర్లో సాగుతోంది.


Click it and Unblock the Notifications











