మా అన్నయ్య విలన్ కాదు: తేల్చి చెప్పిన అల్లరి నరేష్

By Bojja Kumar

రామ్ చరణ్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో బాలీవుడ్ నటుడు వివేక్ ఓబెరాయ్ విలన్ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అల్లరి నరేష్ సోదరుడు, ఒకప్పటి హీరో ఆర్యన్ రాజేష్ కూడా కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. రాజేష్ పాత్ర కూడా విలనిజంతో నెగెటివ్‌గా ఉంటుందని ఆ మధ్య వార్తలు వినిపించాయి.

ప్రస్తుతం తన తాజా మూవీ 'సిల్లీ ఫెల్లోస్' ప్రమోషన్లలో బిజీగా ఉన్న అల్లరి నరేష్.... రామ్ చరణ్ మూవీలో తన సోదరుడు రాజేష్ చేస్తున్న పాత్ర గురించి కూడా స్పందించారు. ఈ మూవీలో అన్నయ్య ఆర్యన్ రాజేశ్ విలన్ రోల్ చేస్తున్నట్టుగా వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదన్నారు.

Aryan Rajesh not playing negative role in RC12

ఈ సినిమాలో అన్నయ్య చాలా మంచి పాత్ర చేస్తున్నాడు. ఒక నటుడిగా ఇది ఆయనకు మంచి పేరు తీసుకొస్తుందనే నమ్మకం ఉంది. అన్నయ్య ఎక్కువగా మాట్లాడరు. తన పాత్రను గురించి అడిగినా చెప్పడు, అందుకే నేను ఈ విషయం చెబుతున్నాను అని నరేష్ స్పష్టం చేశారు.

ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ మూవీని ప్రస్తుతం ఆర్‌సి12 పేరుతో తెరకెక్కుతోంది. రామ్‌చరణ్‌, కియ‌రా అద్వాని, ప్రశాంత్‌, వివేక్‌ ఒబెరాయ్‌, స్నేహ, హిమజ, ప్రవీణ, ఆర్యన్ రాజేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి స్టిల్స్: జీవ‌న్‌, మాటలు: ఎం.రత్నం, ఎడిటర్‌: కోటగిరి వెంకటేశ్వర రావు, ఆర్ట్‌: ఎ.ఎస్‌.ప్రకాష్‌, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, కెమెరామెన్‌: రిషి పంజాబీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వి. వై.ప్రవీణ్ కుమార్, స‌హ నిర్మాత‌: క‌ల్యాణ్ డి.వి.వి, నిర్మాత : దానయ్య డి.వి.వి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బోయపాటి శ్రీను.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X