twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నటుడుగా ఎన్టీఆర్ కు అరవై సంవత్సరాలు

    By Srikanya
    |

    నటుడిగా ఎన్టీఆర్‌ తొలి చిత్రం 'మనదేశం'. ఈ చిత్రం విడుదలై సరిగ్గా ఇవాళ్టికి(మంగళవారం,నవంబర్ 24,2009)కి 60 ఏళ్లు. అంటే ఎన్టీఆర్‌ నటజీవితానికి ఇది వజ్రోత్సవ సంవత్సరం. 1949 నవంబర్‌ 24న విడుదలైన 'మనదేశం' రిలీజైంది. అప్పట్లో సుమారు 4 లక్షల రూపాయలు వ్యయంతో ఈ చిత్రం తయారైంది. ఈ చిత్రానికి ఎన్టీఆర్‌ అందుకున్న పారితోషికం వెయ్యి నూటపదహార్లు. ఎం.ఆర్‌.ఎ. ప్రొడక్షన్స్‌ పతాకంపై కృష్ణవేణి ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ నిర్మాత కె.రాఘవ ఈ చిత్రానికి స్టంట్‌మాన్‌. అలాగే ప్రొడక్షన్‌ వ్యవహారాలు కూడా చూసుకున్నారు.

    'మనదేశం'లో ఎన్టీఆర్‌కు బ్రిటిష్‌ వారి దగ్గర పనిచేసే పోలీసాఫీసర్‌ పాత్ర ఇచ్చారు. "ఇంత చిన్న కానిస్టేబుల్‌ ఉద్యోగం నుంచి ఈ స్థాయికి ఎదిగాను' అని వేలు చూపిస్తూ ఎన్టీఆర్‌ తొలి డైలాగ్‌ చెప్పారు. ఓ సన్నివేశంలో ఎన్టీఆర్‌ లాఠీఛార్జ్‌ చేయాలి. ఆ సన్నివేశంలో లీనమైపోయి వారందర్నీ నిజంగానే చితకబాదేశారు. అందులో హీరోగా నటించిన సీహెచ్‌ నారాయణరావు భవిష్యత్తు ముందే తెలిసినట్టుగా "మీది మంచి కంఠం. మంచి రూపం. ఇలాంటి అందమైన హీరోలు రావాలి. మీరు తప్పకుండా మంచి హీరో పాత్రలు ధరిస్తారు' అని ఎన్టీఆర్‌ను ఆశీర్వదించారు.

    తొలి చిత్రంలో ఓ ప్రత్యేక పాత్రలో ఆయన నటించినా హీరోగా ఆయన జైత్రయాత్ర 'పల్లెటూరి పిల్ల'(1950) చిత్రంతో ప్రారంభమై మూడున్నర దశాబ్దాల పాటు అజేయంగా కొనసాగింది. మూడొందలకు పైగా చిత్రాలలో నటించిన ఎన్‌.టి.ఆర్‌. వైవిధ్యమైన పాత్రలు పోషించి తనకు తానే సాటి అనిపించుకున్నారు. ముఖ్యంగా పౌరాణిక పాత్రలను ఎన్‌.టి.ఆర్‌. అధ్యయనం చేసినట్లుగా మరెవరూ చేయలేకపోయారని చెప్పాలి. అందుకే ఆ పాత్రలలో ఆయనంతగా ఒదిగిపోయారు. ముఖ్యంగా ఎన్‌.టి.ఆర్‌. పేరు చెప్పగానే ఆయన అభినయ కౌశలంతో అలరారిన శ్రీకృష్ణుని పాత్ర ముందుగా కళ్ల ముందు కదలాడుతుంది. ఆ పాత్రలో ఆయన అభినయం రాణించిన తీరు అనితర సాధ్యం. ఒక నటుడు ఒకే పాత్రను(శ్రీకృష్ణుడు) 27 ఏళ్లలో (1953 నుంచి 1979 వరకూ) 18 సార్లు పోషించడమన్నది నిజంగా రికార్డులకే రికార్డ్‌.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X