బండ్ల గణేష్ మళ్లీ పవన్ కళ్యాణ్‌కు ముఖం చూపిస్తారా?.... ఇదీ ఆ భక్తుడి సమాధానం!
Recommended Video

పవన్ కళ్యాణ్‌కు సంబంధించి మాట వస్తే చాలు పూనకం వచ్చిన భక్తుడిలా ఊగిపోయే వారిలో నిర్మాత బండ్ల గణేష్ ఒకరు. పవన్ కళ్యాణ్ నా బాస్ అని, నాలో ప్రాణం ఉన్నంత వరకు నేను ఆయన భక్తుడిగా ఉంటానంటూ గణేష్ గతంలో అనేకసార్లు ప్రకటనలు చేశారు. అలాంటి బండ్ల గణేష్.... పవన్ కళ్యాణ్ తీవ్రంగా వ్యతిరేకించే కాంగ్రెస్ పార్టీలో చేయడం అందరినీ ఆశ్చర్య పరిచింది. ఇక బండ్ల గణేష్ ఎప్పటికీ పవన్ కళ్యాణ్ ముఖం చూయడక పోవచ్చు అనే ఊహాగానాలు కూడా తెరపైకి వచ్చాయి. తాజాగా ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న బండ్ల గణేష్‌కు ఇదే అంశంపై ప్రశ్నలు ఎదురవ్వగా ఆసక్తికరంగా రియాక్ట్ అయ్యారు.

నేను ఎప్పటికీ పవన్ కళ్యాణ్ భక్తుడినే
నేను కాంగ్రెస్ పార్టీలో చేరాను కాబట్టి ఇకపై పవన్ కళ్యాణ్ ముఖం చూడను అనేది అవాస్తవం. ఆయన నా బాస్. బండ్ల గణేష్... సన్నాఫ్ బండ్ల నాగేశ్వరరావు అనేది ఎంత నిజమో? బండ్ల గణేష్... పవన్ కళ్యాణ్ భక్తుడు అనేది అంతే నిజం అని స్పష్టం చేశారు.

పవన్ కళ్యాణ్ నాకు జీవితం ఇచ్చారు
పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నాకు జీవితాన్ని ఇచ్చాడు. ఆయన నాకు ఎప్పటికీ బాస్, నేను ఆయనకు ఎప్పటికీ భక్తుడినే. ఈ విషయంలో ఆర్గ్యుమెంట్స్ వద్దు. దానికి, రాజకీయానికి సంబంధం ఏమిటి? ఆయన రాజకీయ మార్గం వేరు, నాకు ఇష్టమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని బండ్ల గణేష్ తేల్చి చెప్పారు.

పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే స్థాయి లేదు
పవన్ కళ్యాణ్ బలంగా నమ్మే మాట ‘ఈ రోజు దేశం ఇటువంటి పరిస్థితుల్లో ఉండిపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీని దేశం నుండి వెళ్లగొట్టాలి. కాంగ్రెస్ కో హటావో దేశ్ కో బచావో... ఇదీ పవన్ కళ్యాణ్ నినాదం' అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.... దానికి బండ్ల గణేష్ స్పందిస్తూ పవన్ కళ్యాణ్ అలా ఎప్పుడూ అనలేదన్నారు. ఆయన అన్న మాటలు మీకు వినిపించమంటారా? అని మీడియా ప్రతినిధి ఎదురు ప్రశ్నించగా... ఒక వేళ అంటే అనుండొచ్చు. ఆయన గురించి మాట్లాడే స్థాయి నాకు లేదని బండ్ల గణేష్ అన్నారు.

సినిమాలకు, రాజకీయాలకు సంబంధ: లేదు
పవన్ కళ్యాణ్ నా బాస్, మైండ్‌లో ఒకసారి ఫిక్స్ అయిన తర్వాత ఆయన్ను మరిచిపోను.. అని బండ్ల గణేష్ అన్నారు. ఆయనతో సినిమాలు చేస్తారా? అని ప్రశ్నించగా తప్పకుండా చేస్తాను. ఈ విషయంలో ఎలాంటి డౌట్ లేదు. ఆయన కాంగ్రెస్ పార్టీలో విబేధించి ఉండొచ్చు. అలాంటి పార్టీలో నేను చేరి ఉండొచ్చు..... ఇలాంటివి ఎన్ని ఉన్నా మా రిలేషన్ వేరు. రాజకీయం వేరు, సినిమా వేరు. ఈ రెండింటికీ ముండి పెట్టవద్దని బండ్ల గణేష్ స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications











