రాజమౌళి సర్‌తో నాకు పోలికేంటి? మా అమ్మ కూడా ఒప్పుకోదు: ‘సాహో’ డైరెక్టర్ సుజీత్
Recommended Video
'సాహో' రిలీజ్ నేపథ్యంలో ప్రతి ఒక్క అభిమాని ఊహించేది ఒకటే... ఈ చిత్రం 'బాహుబలి 2'ను మించిపోయేలా ఉండాలనే అంచనాలతో థియేటర్లలోకి వస్తారు. దీంతో సహజంగానే హీరో ప్రభాస్, దర్శకుడు సుజీత్ మీద ప్రెజర్ ఓ రేంజిలో ఉంటుంది. ప్రతి ఒక్కరూ ప్రభాస్ గత సినిమాతో 'సాహో'ను కంపేర్ చేస్తూ ఉంటారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుజీత్ మాట్లాడుతూ...'ప్రభాస్ అభిమానులు ఏం కోరుకుంటున్నారో నేను అర్థం చేసుకోగలను. వారు బాహుబలి స్థాయిలో సినిమాను ఆశిస్తున్నారు. అయితే వారిని 'సాహో' డిసప్పాయింట్ చేయదు అనే నమ్మకం ఉంది. అయితే బాహుబలితో సాహోను పోల్చడం సరికాదు. ఎందుకంటే ఈ రెండు చిత్రాలు విభిన్నమైనవి.' అని తెలిపారు.

నిర్మాతలు ఖర్చు గురించి ఆలోచించలేదు
‘సాహో' కోసం ప్రభాస్ చాలా కష్టపడ్డారు. డెడికేషన్‌తో పని చేశారు. ఆయనలా పని చేసే వ్యక్తిని నేను ఇప్పటి వరకు చూడలేదు. నిర్మాతలు కూడా క్వాలిటీకి పెద్ద పీఠ వేస్తూ ఖర్చు గురించి ఆలోచించకుండా నన్ను ఎంకరేజ్ చేశారు. వారి సహకారం వల్లే ‘సాహో' ఇంత గ్రాండ్‌గా వచ్చింది అని సుజీత్ చెప్పుకొచ్చారు.

రాజమౌళి సర్‌తో కంపేర్ చేసుకోను
"ప్రభాస్ అన్న, నిర్మాతల తర్వాత ‘సాహో' విజయవంతం సాధించాలని నేను కోరుకునేది మా అమ్మకోసమే. ఆమె ఈ సినిమా కోసం చాలా కష్టపడి ప్రార్థనలు చేశారు. ఒక వేళ నన్ను నేను రాజమౌళి సర్‌తో కంపేర్ చేసుకుని అహంకారపూరితంగా మాట్లాడితే... వెంటనే అమ్మ నన్ను ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని అడుగుతుంది'' అని సుజీత్ చెప్పుకొచ్చారు.

చాలా మంది నన్ను తీసుకోవద్దని నిర్మాతలకు సూచించారు
‘‘నిజం ఏమిటంటే.. నేను ఎప్పుడూ మీడియాతో మాట్లాడను. నా పనే మాట్లాడుతుందని నమ్ముతాను. సాహోకు ముందు నేను చేసింది ఒక సినిమా మాత్రమే. నాకు ‘సాహో' మూవీ చేసే అవకాశం వచ్చినపుడు చాలా మంది మా నిర్మాతలకు ‘అతడు చాలా చిన్నవాడు, అనుభవం లేనివాడు' అనే సలహాలు ఇచ్చారు'' అని సుజీత్ గుర్తు చేసుకున్నారు.

రాజమౌళితో పోల్చుకుంటే నేను బచ్చా
‘‘నాకు నేనుగా రాజమౌళి సర్ లాంటి పెద్ద వారితో ఎప్పటికీ కంపేర్ చేసుకోను. ఆయనతో కంపేర్ చేస్తే నేను బచ్చా. కానీ నన్ను రాజమౌళి సర్‌తో పోలుస్తూ చాలా హెడ్‌లైన్స్ కనిపిస్తున్నాయి.'' అని సుజీత్ వెల్లడించారు. సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ‘సాహో' ఆగస్టు 30న విడుదల కాబోతోంది.


Click it and Unblock the Notifications











