twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరో బాబా రేప్ కేసుపై రేపే కోర్ట్ తీర్పు: రెండు రాష్ట్రాల్లో హై అలెర్ట్

    గుర్మీత్‌ రేప్‌ కేసుకు సంబంధించిన కోర్టు తీర్పు దగ్గరపడుతున్న కొద్ది పంచకుల పట్టణానికి ఆయన మద్దతుదారులు పోటెత్తుతున్నారు.

    |

    ఎం ఎస్ జీ సినిమాలో మొత్తం అన్ని విభాగాల్లో తన ప్రతిభ చూపించి బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన ఆద్యాతిక గురువు గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ అందరికి గుర్తుకొస్తాడు. ఇండియాలో ఇంతకి లక్షల సంఖ్యలో భక్తులు, ఫలోవర్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అలాంటి అతని మీద 2002లో ఇద్దరు సాదు మహిళలు అత్యాచారం చేసాడని కేసు పెట్టారు. అప్పట్లో ఆ కేసు పెద్ద సంచలనంగా మారింది. ఈ కేసుని 2007లో సిబిఐ న్యాయస్థానంకి బదిలీ చేయడంతో అప్పటి నుంచి దానిపై విచారణ జరుగుతుంది. ఈ కేసులో శుక్ర‌వారం తుది తీర్పును వెల్ల‌డించ‌నున్న‌ది

    హై అలర్ట్‌

    హై అలర్ట్‌

    ఈ సందర్భంగా పంజాబ్‌, హర్యానా రాష్ట్రాల్లో హై అలర్ట్‌ ప్రకటించారు. రెండు రాష్ట్రాల్లోనూ భారీగా పోలీసులు, పారా మిలటరీ బలగాలు మోహరించారు.గుర్మీత్‌ రేప్‌ కేసుకు సంబంధించిన కోర్టు తీర్పు దగ్గరపడుతున్న కొద్ది పంచకుల పట్టణానికి ఆయన మద్దతుదారులు పోటెత్తుతున్నారు.

    30వేలమంది మద్దతుదారులు

    30వేలమంది మద్దతుదారులు

    ఇప్పటికే 30వేలమంది గుర్మీత్‌ మద్దతుదారులు పంచకులలోని ఆయన ఆశ్రమానికి చేరుకోవడంతో అక్కడ వాతావరణం గంభీరంగా మారింది. క్షణక్షణం ఉంత్కంఠ రేపుతుంది.వెన్నునొప్పి ఉన్నా.. తాను మాత్రం కోర్టు ముందు హాజ‌రుకానున్న‌ట్లు డేరా చీఫ్ ట్వీట్ చేశాడు.

    వెన్నునొప్పి ఉన్నా

    వెన్నునొప్పి ఉన్నా

    గుర్మీత్‌కు చెందిన అఫిషియ‌ల్ అకౌంట్ నుంచి ఈ ట్వీట్ వ‌చ్చింది. చ‌ట్టాన్ని ఎప్పుడూ గౌర‌వించామ‌ని, వెన్నునొప్పి ఉన్నా, చ‌ట్టాన్ని గౌర‌వించి కోర్టుకు వెళ్తాన‌ని త‌న ట్వీట్‌లో పేర్కొన్నాడు. అంద‌రూ శాంతియుతంగా ఉండాల‌ని డేరా చీఫ్ త‌న అనుచ‌రుల‌కు సందేశ‌మిచ్చాడు.

    Recommended Video

    Msg The Warrior Lion Heart Press Meet | Gurmeet Ram Rahim Singh | Telugu Filmibeat
    దేవుడిపై విశ్వాసం ఉంది

    దేవుడిపై విశ్వాసం ఉంది

    దేవుడిపై విశ్వాసం ఉంద‌ని, అంద‌రూ శాంతియుతంగా ఉండాల‌న్నారు. పంచ‌కుల‌లోని సీబీఐ ప్ర‌త్యేక‌ కోర్టు డేరా చీఫ్‌పై ఉన్న రేప్ కేసులో శుక్ర‌వారం తుది తీర్పును వెల్ల‌డించ‌నున్న‌ది. అయితే తీర్పు సంద‌ర్భంగా క‌చ్చితంగా డేరా చీఫ్ కోర్టు ముందు హాజ‌రుకావాలంటూ ఆదేశాలున్నాయి.

    కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

    కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు


    గుర్మీత్‌ మద్దతుదారులు రాకుండా పోలీసులు ఎంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, తనిఖీలు చేస్తున్నా.. పెద్దసంఖ్యలో ఆయన అనుచరులు వస్తున్నట్టు తెలుస్తోంది. గుర్మీత్‌పై కోర్టు తీర్పు నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరిగే అవకాశముందని నిఘావర్గాలు భావిస్తున్నాయి. ఈ తీర్పు నేపథ్యంలో శాంతియుతంగా ఉండాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు డేరా స్వచ్ఛ సౌదా మద్దతుదారులకు పిలుపునిచ్చారు.

    English summary
    Dera chief Gurmeet Ram Rahim Singh was charged in 2007 and the trial began the following year after the CBI took the testimonies of the two women. Gurmeet Ram Rahim Singh has denied the charges.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X