మహేష్ బాబు 'కోహినూర్ జాతిరత్నం'.. 15 ఏళ్ళ తరువాత ఆ గొడవతో బయటపడిన ప్రాజెక్ట్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వదిలేసిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద సాలీడ్ విజయాన్ని అందుకుంటే మరికొన్ని డిజాస్టర్ అయ్యాయి. అయితే కెరీర్ మొదట్లో మహేష్ సక్సెస్ లో ఉన్న దర్శకులతో వర్క్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడేవారు. అందులో భాగంగానే ఒక దర్శకుడు కోహినూర్ జాతిరత్నం అనే టైటిల్ తో కథ చెప్పాడట. అయితే ఆ విషయం ఇటీవల ఒక గొడవతో బయటకు వచ్చింది.

హిట్టు కొడితే..
మహేష్ బాబు హీరోగా మొదట్లో కొన్ని అపజయాలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. చాలా కాలం తరువాత ఒక్కడు, మురారి వంటి సినిమాలతోనే ట్రాక్ లోకి వచ్చాడు. అయితే మహేష్ ఎప్పుడైనా సరే ఫస్ట్ సినిమాతో సక్సెస్ అందుకునే దర్శకులను పిలిచి వర్క్ చేయడానికి ఇష్టపడతాడు. ప్రాజెక్ట్ నచ్చితేనే ముందుకు వెళుతుంటాడు.

కోహినూర్ జాతిరత్నం
ఇక ఆ ఆలోచనతో 2004లో ఒక యువ దర్శకుడు చెప్పిన కథకు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కోహినూర్ జాతిరత్నం అనే టైటిల్ తో రెడీ చేసుకున్న ఆ స్క్రిప్ట్ విని మహేష్ సింగిల్ సిట్టింగ్ లో ఒకే చెప్పేశాడట. అయితే ఆ విషయం ఇటీవల దర్శక నిర్మాతల గొడవతో బయటకు వచ్చింది.

దర్శకుడి వల్లే ఫ్లాప్ అయ్యింది
ఆ దర్శకుడు మరెవరో కాదు. యజ్ఞం సినిమాతో అప్పట్లో ఒక ట్రెండ్ సెట్ చేసిన ఏఎస్.రవికుమార్ చౌదరి. అతని రెండవ సినిమా వీరభద్ర. బాలకృష్ణతో చేసిన ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఆ సినిమా నిర్మాత అంబికా కృష్ణ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడి వల్లే ఆ సినిమా ప్లాప్ అయ్యిందని తాగేసి షూటింగ్ కు వచ్చాడని చెప్పాడు.

మహేష్ కంటే ముందే..
ఇక అంబికా కృష్ణ వ్యాఖ్యలపై దర్శకుడు రవికుమార్ కూడా సీరియస్ అయ్యాడు. అయితే ఈ వివాదం గురించి మాట్లాడిన రవికుమార్ వీరభద్ర కంటే ముందే తనకు మహేష్ బాబుతో సినిమా చేసే ఛాన్స్ వచ్చిందని అయినప్పటికీ ఇచ్చిన మాట కోసం అంబికా కృష్ణ ప్రొడక్షన్ లో సినిమా చేసినట్లు చెప్పారు.

ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో
మహేష్ తో సినిమా చేయాలని అతని సోదరి ఘట్టమనేనీ మంజుల అడుగగా కథ వినిపించాను అంటూ.. అదే కోహినూర్ జాతిరత్నం ప్రాజెక్ట్ అని అన్నాడు. మహేష్ బాబుకు కూడా కథ బాగా నచ్చిందని అయితే వీరభద్ర ప్లాప్ తరువాత ఆ ప్రాజెక్ట్ ను ఎవరు పట్టించుకోలేదని ఏఎస్. రవికుమార్ చౌదరి వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











