నేను యాక్షన్ లో ఉంటే రియాక్షన్ ఉండకూడదు: బాలయ్య
బాలకృష్ణ సినిమా అంటే కథ లేకపోయినా నాలుగు పాచిపోయిన మాస్ డైలాగులు ఉంటే చాలని దర్శకులు నమ్ముతుంటారు. అందుకే బాలయ్య చేత నానా రకాల కామెడీలు చేయిస్తూ చేంతాడంత డైలాగులు చెప్పిస్తుంటారు. కంటిచూపుతో చంపేస్తానని బాలయ్య చెప్పగానే విజిల్స్ పడేసరికి పరుచూరి సోదరులు మరింత రెచ్చిపోయి మొలతాడుతో ఉరేస్తా అనే డైలాగుల్ని కూడా బాలకృష్ణ చేత పలికించారు. బాలకృష్ణ సినిమా అంటే అలాంటి డైలాగులు ఉండి తీరాల్సిందేనని మాటల మాంత్రికుడిలా ఫీలయ్యే దాసరి నారాయణరావు 'పరమవీర చక్ర"లో రెచ్చిపోయి డైలాగులు రాసేశారు.
'నేను యాక్షన్ లో ఉంటే రియాక్షన్ ఉండకూడదు" అంటూ న్యూటన్ లానే మార్చేస్తూ బాలకృష్ణ ఇందులో పంచ్ డైలాగులు పేలుస్తున్నారు. బాలకృష్ణ నుంచి పవర్ ఫుల్ డైలాగులు ఆశించే అభిమానులు కూడా పరమవీర చక్ర ప్రోమోల్లో వేస్తున్న డైలాగులు విని చప్పగా ఉన్నాయంటున్నారు. వయస్సుఅయిపోయిన దాసరి ఈమాత్రం రాశాడు చాల్లెమ్మని సరిపెట్టుకోక ఈ సినిమాపై వారికి మళ్లీ అంచనాలు ఎందుకంటారా? అదీ నిజమేననుకోండి.


Click it and Unblock the Notifications











