సంక్రాంతికి పోటీ పడుతున్న టాప్ హీరోల సినిమాలు...!?
సంక్రాంతి తెలుగు వారికే కాదు, తెలుగు సినిమాలకు కూడా పండగే. ఎందుకంటే చాలా సినిమాలు అప్పుడే విడుదలవుతున్నాయి. ఆ పోటీల్లో నిలబడటం అంటే నిర్మాతలకు ఓ ఛాలెంజ్. ఎప్పటిలాలగే వచ్చే సంక్రాంతికి కూడా తెలుగు సినిమాలు రెడీ అవుతున్నాయి. సంక్రాంతి సంబరాలకు చిన్నపెద్ద హీరోలు రెడీ అయిపోయారు.
బాలకృష్ణ సినిమా 'అధినాయకుడు' ఎంఎల్ పద్మకుమార్ చౌదరి నిర్మిస్తున్నఈ చిత్రానికి పరుచూరి మురళి దర్శకత్వం వహిస్తున్నారు. మహేష్ బాబు- బిజినెస్ మాన్ ఇండియా, ఓవర్సీస్ లలో కలెక్షన్లలో అదరగొట్టిన మహేష్ దూకుడు కొనసాగించాలని తహతహలలాడుతున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకుడు. నిర్మాణం ఆర్ ఆర్ మూవీ మేకర్స్. హీరో నాగార్జునకి హెవీ ఎక్స్ పెక్టేషన్ మూవీ 'రాజన్న" దర్శక ధీర రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో రానున్నది.
ప్రభాస్-రెబెల్ రాఘవ లారెన్స్ దర్శకుడు. జె భగవాన్, పుల్లారావు నిర్మాతలు. తమన్నా హీరోయిన్.మిస్టర్ ఫర్ ఫెక్ట్, డార్లంగ్ చిత్రాలతో మంచి జోష్ మీద ఉన్న ప్రభాస్ రెబల్ లో ఓ కొత్త స్టైల్ లో దర్శనమివ్వనున్నాడు. రవితేజ-నిప్పు గత ఏడాది మిరపకాయ్ చిమచిమలాడిన రవితేజ ఈసారి కూడా పోటీలో ఉన్నాడు. దర్శకుడు గుణశేఖర్. వైవియస్ చౌదరి నిర్మాత. సునీల్-పూల రంగడు అచ్చిరెడ్డి నిర్మిస్తున్న 'పూల రంగడు" కూడా ముగ్గుల పండక్కి రానుంది. దర్శకుడు వీరభద్ర చౌదరి. ఇతను అహనా పెళ్లంట తీశారు.
మరి ఇన్ని సినిమాలకు థియేటర్లు దొరకడం చాలా కష్టం. ఈ నేపథ్యంలో థియేటర్లు పెరిగే అంచనాలు ఉన్నాయి. పెద్ద చిత్రాలైన మూడు చిత్రాలకు మంచి క్రేజ్ ఉన్న దృష్ట్యా థియేటర్ల సంఖ్య పెంచటం ద్వారా తొలి వారంలోనే రికార్డ్ వసూళ్లు పొందవచ్చుననే ధీమాతో పంపిణీదారులు ఉన్నారు. ఇదిలా ఉంటే మరి ఇతర చిత్రాలకు థియేటర్ల పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థంగా మారింది. ప్రేక్షకులు మెచ్చె థియేటర్లే కావాలనుకుంటే జిల్లాలో ఇతర చిత్రాల రిలీజ్ ను వాయిదా వేసుకోవాల్సిందేనని ప్రస్తుతం ట్రేడ్ వర్గాలలో వినిపితస్తున్న టాక్ ఇది. మరి సంక్రాంతి బరిలో ఏఏ సినిమాలు వస్తోయో ఏఏ సినిమాలు బాక్స్ బద్దలు కొడుతాయో వేచి చూడాల్సిందే...


Click it and Unblock the Notifications











