ఆ ప్రెషర్ తోనే ఐశ్వర్య రాయ్ తల్లి అవబోతోంది
ఇన్నాళ్ళూ కెరీర్ ముఖ్యమంటూ పిల్లలు వద్దనుకున్న ఐశ్వర్యా రాయ్ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఈ విషయాన్ని ఆమె సోదరుడు ఆదిత్యా రాయ్ వెళ్ళడించారు. భాయ్ దుంజ్ అనే అకేషన్ కోసం అతని ఇంటికి వచ్చిన ఐశ్వర్య తన వారికి వచ్చే ఈ పెస్టివల్ కి బిడ్డతో వస్తానని ప్రామిస్ చేసింది. ప్రస్తుతం మణిరత్నం రూపొందిస్తున్న రావణ్ లో చేస్తున్న ఆమె బ్రేక్ తీసుకుని ఈ అకేషన్ కి అటెండయింది.ఇక ఇప్పటికే పలు సందర్భాలలో ఐశ్వర్య మీడియాకి ఈ విషయమై హింట్ ఇస్తూనే వస్తోంది. తన కమిట్ మెంట్స్ అన్నీ పిబ్రవరికి పూర్తి చేసుకుని డిసెంబర్ 2010 దాకా కొత్తవి ఏవీ ఒప్పుకోవటం లేదు. ఇక అభిషేక్ బచ్చన్ కూడా ఈ వార్తకు చాలా సంతోషపడ్డాడని సమాచారం. అమితాబ్ సైతం తన కుటుంబానికి వారసుడు కావాలని తన కుమారుడుకి పలు మార్లు చెప్పాడని,ప్రెషర్ తెస్తున్నాడని బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి.
ఐశ్వర్యా రాయ్ అభిషేక్ అమితాబ్ రావణ్ మణిరత్నం గురు ఆదిత్యా రాయ్ ఇద్దరు aiswarya rai abhishek amithab family adhitya rai maniratnam guru raavan


Click it and Unblock the Notifications