ఐశ్వర్య రాయ్,హృతిక్ ల 'గుజారిష్ ' చిత్రం ఎలా ఉంది?
ఈ రోజు (శుక్రవారం) విడుదలైన ఐశ్వర్య రాయ్, హృతిక్ రోషన్ ల కాంబినేషన్ లో వచ్చిన గుజారిష్ చిత్రం చాలా బాగుందనే టాక్ తెచ్చుకుంది. సంజయ్ లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని ఓ పెయింటింగ్ లా తీర్చిదిద్దాడని చూసిన వారు మెచ్చుకుంటున్నారు. ఓ మెజీషియన్ జీవిత చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం స్లో నేరేషన్ తో హృదయాల్ని తాకే వేదనతో సాగుతుంది. ఈ చిత్రంలో హృతిక్ రోషన్..నడుము క్రింద భాగం మొత్తం పని చేయని పేషెంట్ గా కనిపిస్తాడు. అలాగే ఐశ్వర్య రాయ్ ఓ నర్స్ గా ఓ కొత్త పాత్రలో ఒదిగిపోయింది. ఇక జీవితమంతా మ్యాజిక్ చేస్తూ గడిపిన వ్యక్తి తన జీవితంలో ఏదన్నా మ్యాజిక్ జరక్కపోతుందా అని ఎదురుచూడ్డం అనే అంశమే ఈ చిత్రాన్ని నిలబెడుతుంది. అయితే ఐశ్వర్య రాయ్, హృతిక్ రోషన్ ఉన్నారు కాబట్టి ధూమ్ లాంటి మసాలా చిత్రం ఆశిస్తే మాత్రం పూర్తి నిరాశే ఎదురవుతుంది. భాక్సాఫీస్ వద్ద మళ్ళా అమితాబ్ తో చేసిన బ్లాక్ లాంటి మ్యాజిక్ ని రీక్రియెట్ చేసారు భన్సాలీ. ఇంతకీ గుజారిష్ అంటే రిక్వెస్ట్ అని అర్ధం.


Click it and Unblock the Notifications











