మాయీ సినిమాలో నటించనున్న గాయని ఆశాభోస్లే
సినిమాలకు ఆరు దశాబ్దాల పాటు తన గాన మాధుర్యాన్ని అందించారు ఆశా భోస్లే. ఇప్పుడు ఆమెకు 77 ఏళ్లు. ఈ వయస్సులో ఆమె నటనను సవాల్‌గా తీసుకుంటున్నారు. ఆమె హిందీ సినిమా మాయీలో నటించడానికి అంగీకరించారు. పలు సంగీత వీడియోలను కూడా ఆమె విడుదల చేశారు. ఇప్పుడు ఆమె ఓ సినిమాలో లీడ్ రోల్ చేయబోతోంది. ఈ సినిమాను సుభాష్ దావర్, నితిని శంకర్ నిర్మిస్తున్నారు. ఉన్న ఒక్క కొడుకు వదిలేస్తే, కూతురూ అల్లుడి ఇంటికి వెళ్తే ఓ మహిళ పరిస్థితి ఎలా ఉంటుందనేది సినిమా కథ ఇతివృత్తం. ఈ సినిమాకు కొత్త దర్శకుడు మహేష్ కడియాల్ దర్శకత్వం వహిస్తున్నాడు.
నటన అనేది తాను ఇంత వరకు చేయని పని అని, తనకు ఏది నచ్చితే అది చేస్తానని తన అభిమానులకు తెలుసునని ఆశా భోస్లే అన్నారు. కథ వినిపించినప్పుడు ఒక తల్లిగా, మనిషిగా తనెంతో కదిలిపోయానని ఆమె అన్నారు. పద్మినీ కొల్హాపురి తన కూతురుగా నటించడం వల్ల కూడా తాను ఈ సినిమాలో నటించడానికి అంగీకరించినట్లు ఆమె తెలిపారు. మాయీ సినిమా షూటింగ్ ఏప్రిల్‌లో ప్రారంభమవుతుంది. షూటింగ్ మొత్తం ముంబైలోనే జరుగుతుంది.


Click it and Unblock the Notifications











