twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భృతికింద ప్రతీనెలా రూ.40వేలివ్వాలి...కోర్టు ఆదేశం

    By Srikanya
    |

    ముంబయి : ప్రముఖ గాయని ఆశాభోంస్లే కుమారుడు హేమంత్‌ భోంస్లే తన మాజీ భార్యకు మధ్యంతరభృతి కింద ప్రతీనెల 40 వేల రూపాయలు ఇవ్వాలంటూ ఇక్కడి కుటుంబ న్యాయస్థానం ఆదేశించింది. ''హేమంత్‌ భోంస్లే నెలవారీ భృతి కింద పిటిషనర్‌ (62 సంవత్సరాల విశ్రాంత గగనసఖి)కు 40,000 చెల్లించాలి. అదీ 2012 మార్చి 20నుంచి కేసు పరిష్కారం అయ్యేంతవరకు'' అని కుటుంబ న్యాయస్థానం జడ్జి ఎస్‌.ఎ.మోరే తన ఆదేశాల ద్వారా తెలిపారు.

    హేమంత్‌ మరో మహిళతో ఆరు సంవత్సరాలుగా కలిసి నివసిస్తూ తనను ఇంటి నుంచి గెంటేశారని, 2002-03నుంచి తాను, తన భర్త వేర్వేరుగా ఉంటున్నామని హేమంత్‌ భార్య న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ప్రస్తుతం తనకు నెలకు కేవలం ఎనిమిది వందల రూపాయలు మాత్రమే పింఛను వస్తుందని తెలిపింది.

    Asha Bhosle’s son to pay maintenance of Rs 40k to ex-wife

    ''హేమంత్‌ స్కాట్లాండ్‌లో నివసిస్తున్నాడు. ఆయన జీవనశైలిని, పిటిషనర్‌ పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్నాం. దీని ప్రకారం కేసు పరిష్కారం అయ్యేంతవరకు ప్రతీ నెల ఆమెకు 40వేల భృతి ఇవ్వవచ్చును'' అని న్యాయస్థానం తెలిపింది. అలాగే కోర్టు ఖర్చుల కింద పదివేల రూపాయలు ఇవ్వాలని ఆదేశించింది.

    English summary
    A family court has ordered singer Asha Bhosle's son, Hemant Bhosle, to pay a monthly interim maintenance of Rs 40,000 to his estranged wife.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X