Don't Miss!
- News సీఎం జగన్పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఆమెను కోర్టుకీడ్చిన సింగర్ ఆశా భోంస్లే
బాలీవుడ్ స్టార్ సింగర్ ఆశా భోంస్లే ఒకప్పటి నటి సాధనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు ఆమె ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు సాధనపై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే....
ఆశా బోంస్లేకు చెందిన బంగ్లాలో సాధన గత 50 ఏళ్లుగా అద్దెకు ఉంటోంది. ఈ క్రమంలో ఆ ఇంటిని సాధన ఆక్రమించింది. ఇంటి సొంతదారైన ఆశాను ఆ ఇంట్లోకి, దాని చుట్టు ఉన్న గార్డెన్లోకి అనుమతి అనుమతించడం లేదు. దీంతో భోంస్లే ఆమెపై ఫిర్యాదు చేసింది.
2010లో నటి సాధన బిల్డర్ యూసఫ్ లక్డావాలాకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసింది. అతని నుంచి నాకు ప్రాణ భయం ఉంది. తాను నివసిస్తున్న ఇంటి నుంచి ఖాళీ చేయాలని బలవంత పెడుతున్నాడని ఆమె అప్పుడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆమెపై ఆశాభోంస్లే ఫిర్యాదు చేయడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. సాధన 'మెరా సాయా', వో కౌన్ థి, హమ్ దోనో లాంటి చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించింది.