twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆమెను కోర్టుకీడ్చిన సింగర్ ఆశా భోంస్లే

    By Bojja Kumar
    |

    బాలీవుడ్ స్టార్ సింగర్ ఆశా భోంస్లే ఒకప్పటి నటి సాధనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు ఆమె ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు సాధనపై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే....

    ఆశా బోంస్లే‌కు చెందిన బంగ్లాలో సాధన గత 50 ఏళ్లుగా అద్దెకు ఉంటోంది. ఈ క్రమంలో ఆ ఇంటిని సాధన ఆక్రమించింది. ఇంటి సొంతదారైన ఆశాను ఆ ఇంట్లోకి, దాని చుట్టు ఉన్న గార్డెన్లోకి అనుమతి అనుమతించడం లేదు. దీంతో భోంస్లే ఆమెపై ఫిర్యాదు చేసింది.

    2010లో నటి సాధన బిల్డర్ యూసఫ్ లక్డావాలాకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసింది. అతని నుంచి నాకు ప్రాణ భయం ఉంది. తాను నివసిస్తున్న ఇంటి నుంచి ఖాళీ చేయాలని బలవంత పెడుతున్నాడని ఆమె అప్పుడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆమెపై ఆశాభోంస్లే ఫిర్యాదు చేయడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. సాధన 'మెరా సాయా', వో కౌన్ థి, హమ్ దోనో లాంటి చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించింది.

    English summary
    
 Singer Asha Bhosle has recently lodged a written complaint against yesteryear star Sadhana alleging that the actress had encroached upon her Khar bunglow. Sadhana has been Bhosle's tenant for over 50 years.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X