"లక్స్ పాప" వీసా మోసం, అరెస్టు

నకిలీ పత్రాలతో వీసాకు ప్రయత్నించిన కేసులో నటి ఆశా సైనీ ( "లక్స్ పాప్ " ఫేం) చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. అమెరికాలో జరుగనున్న తెలుగు సాంస్కృతిక ఉత్సవాల్లో పాల్గొనేందుకు వీసా కోసం దరఖాస్తు చేసుకున్న సైనీ తన మేకప్ ఆర్టిస్టు శ్రీలతతో కలిసి చెన్నై లోని అమెరికన్ కాన్సులేట్ కార్యాలయానికి వచ్చింది.
శ్రీలత ఒకరకంగా, ఆశా సైనీ మరోరకంగా సమాధానాలు ఇవ్వడంతో అమెరికన్ కాన్స లేట్ అధికారులకు అనుమానం వచ్చి డాక్యుమెంట్లను పరిశీలించారు. అవి నకిలీవని తేలింది. మోసం బయటపడడంతో రాయపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెండితెర మీద అందాల ఆరబోతలో వెనుకాడని ఆశా సైని తెలుగులో నర్సింహ నాయుడు చిత్రంలోని సూపర్ హిట్ పాట "లక్స్ పాప" లో నటించింది.


Click it and Unblock the Notifications











