లక్స్ పాపా.. మరీ ఇంత విప్పతీయాలా?(ఫోటో ఫీచర్)
హైదరాబాద్: 'లక్స్ పాప' రీసెంట్ గా చేసిన ఫోటో షూట్ చూసి అందరూ నోరు వెళ్లబెడుతున్నారు. ఆషా షైనీ... మయూరిగా పేరు మార్చుకున్నా... టాలీవుడ్ ప్రేక్షకులు మాత్రం ఎక్కడికెళ్లినా తనను 'లక్స్ పాప'గానే గుర్తిస్తారు అంటోంది బాలీవుడ్ భామ ఆషాషైనీ(మయూరి). ఆ మధ్య రెండు మూడు చిత్రాల్లో ఐటం సాంగ్స్ వంటివి చేసినా ఆమె కెరీర్ లో పెద్ద మార్పు రాలేదు. దాంతో ఆమె తను ఇంకా హాట్ గానే ఉన్నానని చెప్పేందుకు ఫోటో షూట్ తో పలకరిస్తోంది. ఆ ఫోటోలు మీ కోసం..
సరైన బ్రేక్ రాకపోతే ఏ హీరోయిన్ పరిస్ధితి అయినా ఆఫర్స్ కోసం ఎల్లకాలం వెయిట్ చేస్తూ ఉండాల్సిందే అని నిరూపించిన భామల్లో ఆశాషైనీ కూడా చేరింది. చాలా కాలం నుంచి చాలా చిత్రాలు చేసినా ఒక్క సినిమా కూడా ఆమెకు బ్రేక్ ఇవ్వలేకపోయింది. సినిమాలు హిట్టైనా ఆ క్రెడిలో ఆమెకు పెద్ద గా షేర్ రాలేదు. నటనలేక మిగిలిపోయిందని కొందరు అంటే లేదు అదృష్టం లేకే ఆమె కెరీర్ ఆగిపోయిందని మరికొందరు వ్యాఖ్యానిస్తారు.

అందాల ఆరబోతకు కేరాఫ్ అడ్రస్‌గా నిలచి అప్పట్లో కుర్రకారును కిర్రెక్కించింది ఆశా షైనీ... అసలు పేరు ఫ్లోరా షైనీ అయినా సినిమా రంగంలో కోటి ఆశలతో అడుగు పెట్టింది... అందుకే ఆశా షైనీ అయ్యింది... 'లక్స్ పాప 'గా మురిపించింది.

దశాబ్దానికిపైగా టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటిస్తున్నా... ఇప్పటికీ బాలకృష్ణ సరసన 'నరసింహనాయుడు' చిత్రంలో వేసిన లక్స్‌పాప క్యారెక్టరే ప్రేక్షకుల్లో గుర్తుండిపోయింద.

అప్పట్లో ఈ ఒక్కపాటతో ఓ అర డజను చిత్రాల్లో నటించే ఛాన్స్ కొట్టేశా అని చెబుతోంది ఈ సెక్సీబాంబ్. సెకెండ్ ఇన్నింగ్స్‌లో 'ఆ ఇంట్లో...', 'బ్రోకర్' 'చట్టం' లాంటి సినిమాల్లో నటించడం నటిగా మంచి మార్కులే కొట్టేశానని చెబుతోంది ఆషాషైనీ.

కారణం ఏదైనా... కనీసం సెకండ్ గ్రేడ్ హీరోయిన్ కూడా రాణించ లేక పోయింది. అడపా దడపా పెద్దగా గుర్తింపులేని చిత్రాల్లో నటిస్తూ..... నేనూ ఈ పరిశ్రమలో ఉన్నాను అంటూ అప్పడప్పుడు హాట్ హాట్ ఫోటో షూట్లలో పాల్గొంటూ తన ఉనికిని చాటుకుటుంటోంది.

ఇటీవల రెండు పర్యారాయలు హాట్ హాట్ గా రెచ్చిపోయిన ఆశా శైనీ... తాజాగా ఉల్లిపొరలాంటి దుస్తుల్లో సెక్సీగా దుమ్ము రేపింది. సినిమాల్లో అవకాశాలు దక్కించుకోవడానికి ఈ కాలం తారల్లో చాలా మంది ఫాలో అవుతున్న పార్ములా అందాలు ఆరబోయడమే. తమ ఎద అందాలు, బొడ్డు సోయాగాలు పెట్టుబడిగా పెట్టి పైకొచ్చిన వాళ్లు సినీ పరిశ్రమలో చాలా మందే ఉన్నారు. ఇదే దారిలో ఆశా శైనీ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. మరి లక్స్ పాప లక్ష్యం నెరవేరేది ఎన్నడో..?

ఆ ఇంట్లో చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి, బ్రోకర్, చట్టం, చిత్రాలు చేసింది. అలాగే జెడీ చక్రవర్తి దర్సకత్వంలో మనీ మనీ మోర్ మనీ చిత్రం కూడా చేసింది. ఆమె నటించిన మూడు చిత్రాలు ఒకే రోజు డిసెంబర్ 31న విడుదల కావటంతో ఆమె పేరు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులోకి కూడా ఎక్కింది.

సంఖ్యా శాస్త్రం ప్రకారం నేను మయూరిగా పేరు మార్చుకున్నాను.దీంతో కలిసి వస్తుందని భావిస్తున్నారు. అన్ని రకాల పాత్రల్లోనూ కనిపించి అలరించాలన్నదే నా తపన. అలాగే తెలుగు ప్రేక్షకులు నేటికీ నన్ను 'లక్స్ పాప'గా గుర్తుపెట్టుకున్నారు. ఆ తరహా ఐటం సాంగ్స్ చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటోంది.

ప్రస్తుతం ఆషాషైనీ 'ఆకాశంలో సగం'చిత్రం చేస్తోంది. 'నగరం నిద్రపోతున్న వేళ' చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రేమ్‌రాజ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. యండమూరి వీరేంద్రనాథ్.. అనైతికం నవల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది.


Click it and Unblock the Notifications











