Love Me Twitter Review: లవ్ మీ మూవీకి ఊహించని టాక్.. అసలైందే మైనస్.. మరి బేబీ మళ్లీ హిట్ కొట్టిందా!
తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఇప్పటికే ఎంతో మంది సినీ వారసులు ఎంట్రీ ఇచ్చారు. అందులో ఆశీష్ ఒకడు. టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం అయిన అతడు.. మొదటి చిత్రంతో ఆశించిన స్టార్ట్‌ను అందుకోలేకపోయాడు. దీంతో ఈ సారి ఎలాగైనా సక్సెస్‌ను సొంతం చేసుకోవాలన్న కసితో 'లవ్ మీ' అనే సినిమాను చేశాడు. ఎన్నో అంచనాలతో రూపొందిన ఈ మూవీ ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి దీనికి ట్విట్టర్‌లో ఎలాంటి టాక్ వచ్చింది? ఆశీష్ విజయాన్ని అందుకున్నాడా లేదా? అనేవి చూద్దాం పదండి!
దెయ్యంతో లవ్ మీ అంటూ
ఆశీష్ హీరోగా నటించిన తాజా చిత్రమే 'లవ్ మీ'. కిరణ్ భీమవరం తెరకెక్కించిన ఈ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని దిల్ రాజు, శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్సిత, నాగ మల్లిడి నిర్మించారు. ఆస్కార్ విన్నర్ ఎమ్ఎమ్ కీరవాణి దీనికి సంగీతం ఇచ్చారు. ఇందులో సిమ్రన్ చౌదరి, రవి కృష్ణలు అత్యంత ముఖ్యమైన పాత్రల్లో నటించారు.

అలాంటి కథతో వచ్చింది
ఆశీష్ హీరోగా నటించిన డార్క్ థ్రిల్లర్ మూవీనే 'లవ్ మీ'. ఏది చేయొద్దు అంటే అది చేసే ఓ కుర్రాడు.. దెయ్యం జోలికి వెళ్తాడు. తర్వాత దాన్ని ప్రేమించి, ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతాడు. ఆ తర్వాత ఆ దెయ్యానికి ఉన్న ఒక సమస్యను తీర్చడం అనే కాన్సెప్టుతో ఇది తెరకెక్కింది. దీంతో ఈ మూవీ ఆరంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించడంతో పాటు అంచనాలను ఏర్పరచుకుంది.
మంచి కథతో వచ్చింది
అశీష్ - వైష్ణవి చైతన్య జంటగా నటించిన 'లవ్ మీ' సినిమాను చూసిన ఓ నెటిజన్ X (ట్విట్టర్) ఖాతాలో ఇలా స్పందించారు. 'లవ్ మీ మూవీ అనేది ఓ సిల్లీ దెయ్యం కథ. కానీ ఇందులో ఆసక్తికరమైన కోర్ పాయింట్ ఉంది. దాన్ని చూపించడంలో దర్శకుడు పూర్తిగా విఫలం అయ్యాడు. కథను చక్కగా అమలు చేయడం కుదరలేదు' అని చెప్పుకొచ్చారు.
అసలైందే మైనస్‌గానూ
డార్క్ థ్రిల్లర్ కాన్సెప్టుతో రూపొందిన 'లవ్ మీ' మూవీని వీక్షించిన అదే నెటిజన్ 'ఫస్టాఫ్, సెకెండాఫ్‌లో కొన్ని సన్నివేశాలు మాత్రమే బాగున్నాయి. కానీ, సస్పెన్స్‌ను క్రియేట్ చేయడంలో మాత్రం డైరెక్టర్ పూర్తి ఫెయిల్ అయ్యాడు. స్క్రీన్‌ప్లే గందరగోళంగా ఉంది. మ్యూజిక్ అంతగా ప్రభావం చూపలేదు. ఇందులో ఇంకేమీ పెద్దగా ప్రస్తావించనవసరం లేదు' అని వివరించారు.
విజువల్‌గా వర్కౌట్ కాలే
విభిన్నమైన సబ్జెక్టుతో తెరకెక్కిన 'లవ్ మీ' సినిమాను చూసిన మరో నెటిజన్ 'లవ్ మీ అనేది సరిగా అనువదించలేకపోయిన ఓ నవల మాదిరిగా ఉంది. పేపర్‌పై మంచిగా అనిపించినా తెరపై మాత్రం వర్కౌట్ కాలేదు. విజువల్స్ బాగున్నా.. పాత్రల చిత్రీకరణలో, కొన్ని అంశాలను సృష్టించడంలో నమ్మకం కుదరలేదు' అంటూ చెప్పుకొచ్చారు.

ఓవరాల్‌గా అలాంటి టాక్
ఆశీష్ హీరోగా నటించిన 'లవ్ మీ' మూవీకి సంబంధించి ఇప్పటి వరకూ చూసిన ట్వీట్‌ను బట్టి దీనికి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. చాలా మంది ఈ మూవీ ఏవరేజ్‌గా ఉందని అంటున్నారు. ముఖ్యంగా ఈ సినిమా కాన్సెప్టు బాగున్నప్పటికీ దాన్ని చూపించిన తీరు మెప్పించలేదని చెప్తున్నారు. మరి థియేటర్లలో మౌత్ టాక్ ఎలా వస్తుందో కాసేపట్లోనే తేలిపోనుంది.


Click it and Unblock the Notifications











