పబ్ కేసులో అరెస్టయిన వారిలో మహేష్ బాబు మేనల్లుడు అంటూ వార్తలు.. క్లారిటీ ఇచ్చిన కుటుంబ సభ్యులు
హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ప్రముఖ ర్యాడిసన్ బ్లూ హోటల్ పై టాస్క్ ఫోర్స్ అధికారులు అకస్మాత్తుగా నిర్వహించిన దాడులు ఒక్కసారిగా మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. అందులో ప్రముఖ సెలబ్రెటీలతో పాటు సినిమా తారల ఫ్యామిలీకి చెందిన వారు కూడా ఉండడం చర్చనీయాంశంగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా పబ్ ను నడపడంతో పోలీసులు పబ్ నిర్వాహకులను అరెస్ట్ చేశారు. అంతే కాకుండా పబ్ లో ఉన్న వారిని కూడా అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఇక అరెస్ట్ చేసిన వారికి పోలీసులు ప్రత్యేకంగా కౌన్సెలింగ్ నిర్వహించి పంపించడం జరిగింది.
ఇక పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో మహేష్ బాబు ఫ్యామిలీకి చెందిన కుర్రాడు కూడా ఉన్నట్లు టాక్ రాగా ఆ విషయంపై వెంటనే వారి కుటుంబ సభ్యులు స్పందించారు.

ఇదివరకే హెచ్చరికలు
ఫుడింగ్ మింగ్ పబ్ యాజమాన్యం నిబంధనలకు విరుద్దంగా పబ్ నడుపుతున్నారు అని.. అర్ధరాత్రి 12 తరువాత కూడా కొనసాగించడంపై ఇదివరకే అధికారుల నుంచి హెచ్చరికలు అందాయి. అయితే పబ్ నిర్వాహకులు రాజకీయ నాయకుల అండతోనే ఆ విధంగా కొనసాగినట్లు టాక్ వస్తోంది. హైదరాబాద్ లోని టాప్ సెలబ్రెటీలు కూడా అక్కడికి వస్తుంటారని అందుకే అక్కడికి పోలీసులు వెళ్ళరు అనే విధంగా టాక్ వచ్చింది.

150 మంది అదుపులోకి..
ఇక టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆ విషయం గురించి తెలుసుకొని రంగంలోకి దిగారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న పబ్బులపై ఆకస్మిక దాడులు నిర్వహించడం స్టార్ట్ చేశారు. అర్ధరాత్రి 3 గంటల వరకు ర్యాడిసన్ హోటల్ తెరచి ఉందని అధికారులు పబ్ సిబ్బందిని అలాగే పబ్ లో మరో 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇక వారందరు అదుపులోకి తీసుకునే సమయంలో హంగామా చేసినట్లు తెలుస్తోంది.

రాహుల్ సిప్లిగంజ్.. స్టార్ డాటర్
ఇక అదుపులోకి తీసుకున్న వారందరినీ కూడా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక ప్రముఖ టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ను కూడా అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక బిగ్ హీరో ఫ్యామిలీకి చెందిన అమ్మాయి కూడా అందులో ఉన్నట్లు సమాచారం. ఈ పార్టీలో ప్రముఖ సినీ తారల పిల్లలతో పాటు పలు రాజకీయ నాయకుల పిల్లలు కూడా ఉన్నారని టాక్ వస్తోంది.

మహేష్ మేనల్లుడు
అయితే మహేష్ బాబు ఫ్యామిలీకి చెందిన ఒక యువకుడు కూడా ఉన్నట్లు కొన్ని వెబ్ మీడియాలో అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. అతను మరెవరో కాదు ఇటీవల హీరో సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన మహేష్ మేనల్లుడు గల్లా అశోక్ అని సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా వచ్చాయి. అయితే అశోక్ ఉన్నట్లుగా ఒక్క ఫోటో కూడా బయటకు రిలీజ్ కాలేదు.
Recommended Video


అది నిజం కాదు..
అదుపులోకి చేసుకున్నవారిలో గల్లా అశోక్ ఉన్నట్లుగా వార్తలు వైరల్ కావడంతో వెంటనే వారి కుటుంబ సభ్యులు క్లారిటీ ఇచ్చారు.. హైదరాబాద్‌లోని పబ్‌లో జరిగినపార్టీలో అరెస్టయిన వారిలో అశోక్ గల్లా కూడా ఉన్నారని కొన్ని మీడియా వస్తున్న కథనాలలో నిజం లేదు... అని గల్లా కుటుంబం క్లారిటీ ఇచ్చింది. ఇక అరెస్ట్ చేసిన వారికి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











