ఎన్టీఆర్ అశోక్ జులై 13కి వాయిదా!
ఎన్టీఆర్- సురేందర్‌రెడ్డి కాంబినేషన్‌లో రూపొందుతున్న అశోక్ సినిమా జూలై 13కి వాయిదా పడినట్టు తెలుస్తోంది. షెడ్యూలు ప్రకారమైతే ఈ సినిమా జూలై 7న విడుదల కావలసి ఉంది. సమీరారెడ్డి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో సోనూసూద్ కూడా ఉన్నారు. వరుస ఫ్లాప్‌లతో ఢీలా పడిన జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో కసిగా నటించినట్టు యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. తొలి సినిమా అతనొక్కడే ద్వారా సంచలనం విజయం సాధించిన సురేందర్ రెడ్డి ఈ సినిమాను వినూత్నంగా రూపొందించినట్టు తెలుస్తోంది. ఈ సినిమాను ప్రాంతాల వారీగా కొనుగోలు చేయడానికి బయ్యర్లు ముందుకు వస్తున్నప్పటికీ, సినిమాను మరింత పర్‌ఫెక్టుగా తీర్చిదిద్దేందుకే కొన్ని రోజులు వాయిదా వేసినట్టు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications