twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'చెప్పులతో కొట్టే రోజు వస్తుంది'.. రెండవ రోజు 'పేట' పరిస్థితి ఇది.. నిర్మాత తీవ్ర వ్యాఖ్యలు!

    |

    సంక్రాంతి సందర్భంగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. నాలుగు భారీ చిత్రాలు విడుదలవుతున్నాయి. అందులో ఒకటి సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పేట. ఈ చిత్రానికి థియేటర్స్ కేటాయించడం లేదంటూ తెలుగులో ఈ చిత్రాన్ని విడుదుల చేస్తున్న నిర్మాత అశోక్ వల్లభనేని గగ్గోలు పెడుతున్నారు. పేట ప్రీరిలీజ్ ఈవెంట్ లో యూవీ క్రియేషన్స్, దిల్ రాజు, అల్లు అరవింద్ పై అశోక్ వల్లభనేని, ప్రసన్న కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదం మరింత వేడెక్కేలా కనిపిస్తోంది.

    అశోక్ వల్లభనేని మరోసారి

    అశోక్ వల్లభనేని మరోసారి

    వల్లభనేని అశోక్ చేసిన తీవ్రమైన వ్యాఖ్యలతో పేట చిత్ర థియేటర్స్ గొడవ మరింత పెద్దదిగా మారుతోంది. అశోక్ వల్లభనేని వ్యాఖ్యలకు దిల్ రాజు కౌటర్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఇది మీడియాలో హాట్ టాపిక్. అశోక్ వల్లభనేని మరోమారు రెచ్చిపోయారు. ఓ టివి డిబేట్ లో పాల్గొన్న అశోక్ వల్లభనేని మాట్లాడుతూ.. ఇండిస్ట్రిలో పెత్తనం చేస్తున్న వారిపై, పేట లాంటి చిత్రాలకు థియేటర్స్ లేకుండా చేస్తున్నవారిని చెప్పులతో కొట్టి బుద్ది చెప్పే రోజు వస్తుందని మరోమారు కాట్రవర్షియల్ కామెంట్స్ చేశారు.

    2018 పోల్: ఈ హీరోలు, హీరోయిన్ల జాతకాలు మీ చేతుల్లోనే.. ఓట్ వేసి గెలిపించండి!2018 పోల్: ఈ హీరోలు, హీరోయిన్ల జాతకాలు మీ చేతుల్లోనే.. ఓట్ వేసి గెలిపించండి!

    ఆ నలుగురు కారణం

    ఆ నలుగురు కారణం

    అశోక్ వల్లభనేని వ్యాఖ్యలని డిబేట్ లో పాల్గొన్న మరో ఎగ్జిబిటర్ అడ్డుకున్నారు. ఇండస్ట్రీలో పెత్తనం చెలాయిస్తున్న ఆ నలుగురికి ఈయన మద్దత్తు దారుడు అంటూ అశోక్ ఆరోపణలు చేశారు. పరస్పర ఆరోపణలు, విమర్శలతో థియేటర్స్ వివాదం ముదురుతోంది. ఆల్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాకే థియేటర్స్ లేకుంటే ఎలా అని అశోక్ వల్లభనేని అంటుంటే.. తెలుగు సినిమాలకే థియేటర్స్ సరిపోని పరిస్థితి అని దిల్ రాజు కౌంటర్ ఇచ్చారు.

    ఆరు నెలల క్రితమే

    ఆరు నెలల క్రితమే

    వల్లభనేని అశోక్ వ్యాఖ్యలపై దిల్ రాజు స్పందిస్తూ.. ఎన్టీఆర్ బయోపిక్, వినయ విధేయ రామ, ఎఫ్2 చిత్రాలు ఆరు నెలల క్రితమే విడుదల తేదీని ఖరారు చేసుకున్నాయని అన్నారు. పేట చిత్రం కేవలం 20 రోజుల క్రితమే విడుదల ఖరారు చేసుకుంది. తెలుగు సినిమాలని కాదని తమిళ చిత్రాన్ని థియేటర్స్ ఇచ్చే పరిస్థితి లేదని దిల్ రాజు తేల్చి చెప్పేశారు.

    పేట పరిస్థితి ఇది

    పేట పరిస్థితి ఇది

    నిర్మాతల మధ్య థియేటర్స్ గొడవ నేపథ్యంలో షాకింగ్ విషయాలు బయట పడుతున్నాయి. పేట చిత్రం జనవరి 10న విడుదల కాబోతోంది. తొలి రోజు హైదరాబాద్ వ్యాప్తంగా ఈ చిత్రానికి బాగానే థియేటర్స్ కేటాయించారు. కానీ 11న వినయ విధేయ రామ చిత్రం విడుదల కానుండడంతో పరిస్థితి మారిపోనుంది. వినయ విధేయ రామ చిత్రం అత్యధిక థియేటర్స్ లో విడుదల కావడం వల్ల పేట చిత్రం రెండవ రోజు హైదరాబాద్ లో రెండు థియేటర్స్ లో మాత్రమే ఉండనుందట. రెండవ వారం నుంచి పరిస్థితి మారే అవకాశం ఉంది.

    English summary
    Ashok Vallabhaneni on small cinema not getting theatres. Once again he made controversial comments
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X