కన్ఫ్యూజన్ లో విశ్వక్ సేన్.. మరో సారి అశోకవనంలో అర్జున కళ్యాణం రిలీజ్ వాయిదా

తెలుగు సినిమా హీరో విశ్వక్సేన్ ని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హీరోగా చేసిన రెండు మూడు సినిమాలకే ఆయన తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. స్వయంగా దర్శకత్వం వహిస్తూ హీరోగా నటించిన ఫలక్నామ దాస్ సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకోవడంతో తెలుగు సినీ పరిశ్రమలో యంగ్ హీరోగా నిలబడ్డాడు. అయితే ఇప్పుడు ఆయన పెద్ద కన్ఫ్యూజన్ లో పడిపోయినట్లు కనిపిస్తోంది. దానికి కారణం ఆయన హీరోగా నటిస్తున్న ఒక సినిమా రిలీజ్ డేట్ లను అనేక సార్లు వాయిదా వేస్తూ రావడం. ఆ సంగతి ఏంటో చూద్దామా?

ఈ నగరానికి ఏమైంది

ఈ నగరానికి ఏమైంది

హైదరాబాద్ లో పుట్టి పెరిగిన దినేష్ కుమార్ చిన్నప్పటి నుంచి సినిమాల మీద విపరీతమైన ఆసక్తి పెంచుకున్నాడు. ఎలా అయినా సినీరంగంలో ప్రవేశించాలని కోరికతో తన పేరును విశ్వక్సేన్ గా మార్చుకుని వెళ్ళిపోమాకే అనే సినిమాతో హీరోగా లాంచ్ అయ్యారు. ఆ సినిమా అంతగా పేరు తీసుకు రాలేదు కానీ మరో ఆఫర్ అయితే తెచ్చిపెట్టింది. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ నగరానికి ఏమైంది సినిమా విశ్వక్సేన్ కి మంచి పేరు తీసుకువచ్చింది.

వరుస అవకాశాలు

వరుస అవకాశాలు

ఆ సినిమా పూర్తయిన తర్వాత మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన అంగమలై డైరీస్ అనే సినిమాని తెలుగులో ఫలక్నామా దాస్ పేరిట రీమేక్ చేశారు. ఆ సినిమాకు దర్శకత్వం వహిస్తూ స్వయంగా తన తండ్రి నిర్మాణంలో విశ్వక్సేన్ హీరోగా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. జరిగిన మార్కెట్ కి కలెక్షన్స్ కూడా బాగానే రావడంతో ఈ సినిమా హిట్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత వరుస అవకాశాలు అందుకుంటున్నాడు విశ్వక్సేన్.

అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం

అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం

హీరో విశ్వక్‌ సేన్‌ నటించిన తాజా చిత్రం 'అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం'. విద్యాసాగర్‌ చింత ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా బి వి ఎస్‌ ఎన్‌ ప్ర‌సాద్ స‌మర్ఫ‌ణ‌లో ఎస్‌వీసీసీ డిజిట‌ల్ బ్యాన‌ర్‌ పై బాపినీడు, సుధీర్ ఈద‌ర‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే రిలీజ్‌ చేసిన టీజర్‌, పోస్టర్స్‌ సినిమాపై మంచి హైప్‌ను క్రియేట్‌ చేసింది. ఈ సినిమాలో విశ్వక్ సేన్ అల్లం అర్జున్ కుమార్ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. జై క్రిష్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తుండగా ప‌వి కె.ప‌వ‌న్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్న ఈ సినిమాకి విప్ల‌వ్ ఎడిట‌ర్‌ గా, ప్ర‌వ‌ల్య దుడ్డిపూడి ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

మళ్ళీ వాయిదా

మళ్ళీ వాయిదా


ఇక అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉండగా పలు మార్లు రిలీజ్ డేట్ వాయిదా పడింది. చివరగా ఈ సినిమా ఈ ఏప్రిల్ 22న విడుదలవుతున్నట్లు ప్రకటించగా .. మరోసారి వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఏప్రిల్ 22న విడుదల కావాల్సిన విశ్వక్ సేన్ అశోకవనంలో అర్జున కళ్యాణం చివరి నిమిషంలో వాయిదా పడింది. KGF 2 మేనియా కొనసాగుతూ ఉండడంతో ఈ టైమ్‌లో విడుదల చేస్తే.. సరిగా ఆదరణ పొందకపోవచ్చని దర్శక నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Recommended Video

KAKA TALKS: Frustrated Fans Over Beast Result నెల్సన్.. ది విలన్ | EP - 01 | Filmibeat Telugu
మే 6న

మే 6న

ఇక ఆ తర్వాత ఈ సినిమా ఏప్రిల్ 30న విడుదల కానుందని యూనిట్ ప్రకటించింది. చిరంజీవి ఆచార్య సినిమా విడుదలైన ఒకరోజు తర్వాత విశ్వక్ సేన్ అశోకవనంలో అర్జున కళ్యాణం విడుదల అయితే ఇబ్బందే అని భావించి ఇప్పుడు మరో డేట్ ప్రకటించింది. ఫైనల్ గా ఈ సినిమాను మే 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింద టీమ్. అయితే విశ్వక్ సేన్ కన్ఫ్యూజన్ లో ఉన్నాడని అందుకే ఇన్నిసార్లు రిలీజ్ డేట్ వాయిదా పడిందని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X