»   » బూతులు: దర్శకుడు, అతని తల్లిని టార్గెట్ చేస్తూ...

బూతులు: దర్శకుడు, అతని తల్లిని టార్గెట్ చేస్తూ...

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: యూట్యూబ్ ఛానల్‌లో AIB(ఆల్ ఇండియా బ్యాక్‌చూద్) పేరుతో ప్రసారం అవుతున్న పేరడీలు వివాదాస్పదం అవుతున్నాయి. అయితే ఈ పేరడీల్లో ప్రముఖ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ కూడా పాలు పంచుకోవడం వివాదాస్పదం అయింది. AIB అనేది ఇండియన్ కామెడీ గ్రూపు. ఇండియన్ పాలిటిక్స్, ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇతర అంశాలపై పేరడీలు AIBలో చేస్తుంటారు. అయితే ఈ షోలలో అశ్లీలం ఎక్కువవుతుందే ఆరోపణలు కూడా ఉన్నాయి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Ashoke Pandit targets Karan Johar

తాజాగా ఈ పేరడీలో రణవీర్ సింగ్, కరణ్ జోహార్, అర్జున్ కపూర్ పాల్గొన్నారు. అయితే వీరు షోలో అశ్లీలమైన బాష వాడరని పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కొందరు వీరిపై పోలీసులకు ఫిర్యాదులు చేసేందుకు, కేసులు పెట్టేందుకు రెడీ అవుతున్నారు. కొందరు సోషల్ మీడియా ద్వారా ఆగ్రహం వ్యక్తం చేసారు.

ప్రముఖ ఫిల్మ్ మేకర్, కొత్తగా ఏర్పాటయిన సెన్సార్ బోర్డులో మెంబర్ అయిన అశోక్ పండిత్ AIB షోను విమర్శిస్తూ కరణ్ జోహార్ పై చేసిన ట్వీట్ వివాదాస్పదం అయింది. అశోక్ పండిత్ తన ట్వీట్లో కరణ్ జోహార్‌తో పాటు కరణ్ తల్లి ప్రస్తావ తేవడం వివాదానికి కారణమైంది. అతని ట్వీట్ క్రింది విధంగా ఉంది...

అయితే అశోక్ పండిత్ చేసిన ట్వీట్‌పై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తల్లి ప్రస్తావన తెచ్చి ఇంత నీచంగా వ్యవహరించడం తగదని, ఇలాంటి వ్యక్తులు సెన్సార్ బోర్డులో ఉండటానికి వీల్లేదు, వెంటనే అశోక్ పండిత్ ను సెన్సార్ బోర్డు నుండి తొలగించాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.

English summary
Filmmaker Ashoke Pandit, a member of the new Censor Board, sparked a controversy on Tuesday with his tweet about director Karan Johar’s appearance on AIB Knockout, which numerous social media users said was crass and warranted his removal from the panel.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu