కూతురు పెళ్లిలో వెంకటేష్ డ్యాన్స్ కేక.. రానా, సల్మాన్ ఖాన్‌తో కలిసి .. వైరల్‌గా మారిన వీడియో

Recommended Video

Venkatesh And Salman Khan Dance Video Goes Viral In Social Media

విక్టరీ వెంకటేష్ కూతురు అశ్రిత వివాహం ప్రముఖ పారిశ్రామికవేత్త, హైదరాబాద్ రేస్ కోర్స్ చైర్మన్ ఆర్ సురేందర్ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డితో జరిగింది. ఆదివారం (మార్చి 24న) జైపూర్‌లో జరిగిన వివాహానికి బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ప్రత్యేక ఆకర్షణగా మారారు. ఈ పెళ్లిలో భాగంగా జరిగిన సంగీత్‌లో సల్మాన్ ఖాన్, వెంకటేష్, రానా రచ్చ చేశారు. వారు చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మీరే ఆ డ్యాన్స్ చూడండి..

సంగీత్‌లో సమంత, నాగ చైతన్య

సంగీత్‌లో సమంత, నాగ చైతన్య

అశ్రిత, వినాయక్ రెడ్డి వివాహం బంధు, మిత్రుల సమక్షంలో నిరాడంబరంగా జరిగింది. ఈ పెళ్లికి సల్మాన్ ఖాన్ రావడం విశేషంగా మారింది. ఈ పెళ్లిలో సంగీత్ కార్యక్రమంలో నాగచైతన్య, సమంత, సల్మాన్ చేసిన డ్యాన్సులు ఆకట్టుకొన్నట్టు సమాచారం.

వేదికపై సల్మాన్ ఖాన్, వెంకటేష్

వేదికపై సల్మాన్ ఖాన్, వెంకటేష్

ఇక సల్మాన్ ఖాన్‌తో రానా, వెంకటేష్ చేసిన డ్యాన్స్ కేక పెట్టింది. సాధారణంగానే వెంకటేష్ కుటుంబ వేడుకల్లో ఉత్సాహంగా ఉంటారు. ఇక కూతురు పెళ్లి వేడుకలో రచ్చ చేశారు. సల్మాన్ ఖాన్‌తో కలిసి వెంకటేష్ స్టెప్పులు వేశారు. వారికి తోడు రానా జత కలవడంతో వేదిక దద్దరిల్లింది.

ఝుమ్మేకి రాత్ హై పాటకు

కిక్ సినిమాలోని పాట ‘ఝమ్మే కి రాత్ హై' పాటకు వెంకటేష్, సల్మాన్ ఖాన్, రానా డ్యాన్సు చేశారు. సల్మాన్ ఖాన్‌కు ఏ మాత్రం తగ్గకుండా వెంకటేష్ స్పెప్పులు వేయడం గమనార్హం. మధ్యలో రానా వేసిన స్పెప్పులు కూడా ఆకట్టుకొన్నాయి.

హైదరాబాద్‌లో డిన్నర్

హైదరాబాద్‌లో డిన్నర్

జైపూర్‌లో పెళ్లి వేడుక అనంతరం సోమవారం వెంకటేష్ కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు చేరుకొంటారు. త్వరలోనే ఈ పెళ్లికి సంబంధించిన విందును హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నారు. ఈ వేడుకకు తెలుగు, దక్షిణాది సినీ ప్రముఖులను, వ్యాపార, క్రీడా ప్రముఖులను ఆహ్వనించినట్టు తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X