ఇంద్రగంటి మోహన్ కృష్ణ కొత్త చిత్రం టైటిల్ ఇదే..
ఈ చిత్రంతో హీరోయిన్ ఈషా పరిచయమవుతోంది. నిర్మాత దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ "దర్శకుడు చెప్పిన కథలోని నవ్యత, దాని తెరపై చిత్రీకరించే విధానం సరికొత్తగా నడుస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తుంది. నాయకా నాయికలు ఉత్తమ స్థాయి ప్రతిభను కనబరుస్తున్నారు. షూటింగ్ ముగింపు దశలో ఉన్న చిత్రాన్ని మే నెలాఖరులోగా విడుదల చేస్తాం'' అని చెప్పారు.
ఇక ఇది ఓ ఉద్వేగభరితమైన రొమాంటిక్ డ్రామా అని దర్శకుడు మోహనకృష్ణ తెలిపారు. "నిజమైన రొమాన్స్, నిజమైన జీవితం, నిజమైన అనుభవాలు, నిజమైన నాటకీయ సన్నివేశాలు, హృదయాన్ని స్పృశించే భావోద్వేగాల సంగమమే ఈ చిత్రం. ప్రేమ, పెళ్లి, సరైన భాగస్వామిని ఎంచుకోవడం ఎలా అనే విషయాలపై ఎన్నో చర్చలు, వాదోపవాదాలు వస్తున్న సమయంలో ఈ కథ తాలుకు బీజం నాలో పుట్టింది'' అని ఆయన చెప్పారు.
రవిబాబు, రావు రమేశ్, ఉప్పలపాటి నారాయణరావు, అవసరాల శ్రీనివాస్, తాగుబోతు రమేశ్, కల్యాణీ మాలిక్, రోహిణి, మధుబాల, ప్రగతి, ఝాన్సీ తారాగణమైన ఈ చిత్రానికి పాటలు: సీతారామశాస్త్రి, అనంత శ్రీరామ్, సంగీతం: కల్యాణి కోడూరి, ఛాయాగ్రహణం: పి.జి. విందా, సహ నిర్మాతలు: వివేక్ కూచిభొట్ల, జగన్మోహన్‌రెడ్డి వి., కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.


Click it and Unblock the Notifications












