ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజెనెస్ స్టూడెంట్స్ వారు అష్టాచెమ్మ చిత్రం నిర్మాణాన్ని కేస్ స్టడీగా పరిశీలించనున్నారు. వారి కోర్స్ లో భాగంగా ఇంటరప్యునరషిప్ కి ఈ చిత్రం నిర్మాణంని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం తులనాత్మక పరిశీలనా పాఠాన్ని ప్రొపెసర్ రామ వెల్లూరి కి అందచేయనున్నారు. నిజానికి ఇటువంటి కేస్ స్టడి ఇండియన్ బిజెనెస్ స్కూల్ లో ఇదే ప్రధమం. అంతేగాక అందుకు అష్టాచెమ్మా చిత్రం ఎంపికకావటంపై కూడా చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక నిర్మాణం పరంగా అంటే ఈ చిత్ర నిర్మాత రామ్ మోహన్ ఆర్ధికంగా ఎలాంటి నిర్ణాయాలు తీసుకుని తమ చిత్రాన్ని విజయపధంలో పయనింపచేసారు..ఎంత తక్కువ బడ్జెట్ లో ఎంత ఎక్కువ లాభం సంపాదించారన్న దిశలో సాగుతుంది.ఇక అష్టాచెమ్మా చిత్రాన్ని ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరక్ట్ చేసారు. అలాగే ఈ చిత్రంలో కలర్స్ స్వాతి,నాని,అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రలను పోషించారు.