ఆనందంలో తప్పు చేసేసింది!.. అయన అలా రిక్వెస్ట్ చేశారంటూ చెబుతోన్న అషూ రెడ్డి

అషూ రెడ్డి నేడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్. ఉదయం నుంచి అషూ రెడ్డి వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. పవన్ కళ్యాణ్‌తో అషూ రెడ్డి దిగిన ఫోటోలు, పవన్ కళ్యాణ్ ఇచ్చిన లేఖ, ఆమె చేసిన కామెంట్లు ఇలా ప్రతీ ఒక్కటీ వైరల్ అయ్యాయి. పైగా నెటిజన్లు వేసిన వింత ప్రశ్నలకు అషూ ఇచ్చిన రిప్లైలు కూడా అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. ఇప్పుడు తాజాగా మరో పోస్ట్ చేసింది.

అషూ రెడ్డి అలా..

అషూ రెడ్డి అలా..

పవన్ కళ్యాణ్‌ను కలిసిన అషూ.. నా దేవుడిని మళ్లీ కలిశాను.. మొదటి సారి కలిసినప్పుడు నా టాటూను చూపించిన సందర్భం కూడా గుర్తుందని ఆయన అన్నారు. టీ తాగమని ఆఫర్ చేశారు.. రెండు గంటల సేపు ముచ్చట్లు పెట్టుకున్నాం. ఎంతో హాయిగా అనిపించింది. ఎంతో సంతోషంగా ఉంది.. వెళ్లే ముందు ఓ లెటర్‌ను కూడా ఇచ్చాడు. నా ఫస్ట్ లవ్ ఎప్పుడూ పవన్ కళ్యాణ్ అని చెప్పుకొచ్చింది.

 అలా పోస్ట్..

అలా పోస్ట్..

అయితే ఆ విషయాన్ని అషూ రెడ్డి చెబుతూ ఓ పోస్ట్ చేసింది. అందులో పవన్ కళ్యాణ్‌తో దిగిన ఫోటో, ఆయన రాసిన లేఖను జత చేసింది. అయితే ఇక అషూ చేసిన పోస్ట్‌లో డైరెక్టర్ క్రిష్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది. అదే అషూ చేసిన తప్పు. ఆనందంలో అసలు విషయం గుర్తించలేకపోయింది.

 ఇన్ స్టాగ్రాం ఖాతా..

ఇన్ స్టాగ్రాం ఖాతా..

అసలు డైరెక్టర్ క్రిష్‌కు ఇన్ స్టాగ్రాం ఖాతానే లేదు. కానీ అషూ మాత్రం ఆనందంలో ఈ విషయాన్ని సరిగ్గా గుర్తించలేదు. అవేమీ పట్టించుకోని అషూ రెడ్డి.. క్రిష్ పేరుతో ఉన్న ఏదో ఒక ఖాతాను ట్యాగ్ చేసింది. అయితే అప్పటి నుంచి రచ్చ ప్రారంభమైంది.

 అది ఫేక్ ఖాతా..

అది ఫేక్ ఖాతా..

అయితే అది ఫేక్ ఖాతా అని తెలియని కొందరు దాన్ని ఫాలో అవ్వడం ప్రారంభించారట. ఈ విషయం చివరకు క్రిష్ వద్దకు కూడా వెళ్లిందట. ఇదే విషయాన్ని అషూకి చెప్పడంతో ఆమె తన తప్పును సరిదిద్దుకుంది. ఆమె చేసిన పోస్ట్‌లో క్రిష్ పేరును తొలిగించేసింది.

పర్సనల్ రిక్వెస్ట్..

పర్సనల్ రిక్వెస్ట్..

డైరెక్టర్ క్రిష్ గారు ఇన్ స్టాలో లేరు.. ఆయనకు ఎలాంటి ఖాతాలేదు.. ఆయన పేరుతో ఉన్న ఖాతాను ఎవ్వరూఫాలో అవ్వకండి.. ఇది ఆయన పర్సనల్ రిక్వెస్ట్ అంటూ అషూ ఓ పోస్ట్ చేసింది. మొత్తానికి అషూ అత్యుత్సాహం క్రిష్ ఇన్ స్టాగ్రాం ఖాతాపై ప్రభావం పడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X