ఇండస్ట్రీలో మరో విషాదం.. ఉరి వేసుకుని యువ నటుడు మృతి
మరాఠి ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. యువ నటుడు అశుతోష్ భక్రే(32) ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఇండస్ట్రీలో మరణాలు అందర్నీ కుదిపేస్తోండగా.. సుశాంత్ ఆత్మహత్య ఘటనను ఇంకా ఎవ్వరూ మరిచిపోలేకపోతున్నారు. ఇలాంటి సమయంలో మరో నటుడు మృతి చెందడంతో అందరూ తీవ్ర దిగ్భ్రాంతికి లోనవుతున్నారు. అసలింతకీ ఏం జరిగిందో ఓ సారి చూద్దాం.
మహారాష్ట్ర నాందెడ్‌లోని గణేష్ నగర్ ప్రాంతంలో నివాసం ఉంటోన్న అశుతోష్.. తన ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత కొన్ని రోజులుగా ఆయన తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని, అందుకే ఆయన ఈ ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని ఆయన సన్నిహితులు భావిస్తున్నారు. ఈ ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న మహారాష్ట్ర పోలీసులు అనుమానాస్పద మృతి కింద దర్యాప్తు చేపడుతున్నారు.

అశుతోష్ భక్రే భకార్, ఇచర్ థార్లా లాంటి మరాఠీ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన భార్య మయూరి దేశ్ ముఖ్ కూడా సినీ పరిశ్రమకు చెందిన వారే. 'ఖుల్తా కాళీ ఖులేనా' అనే సీరియల్ ద్వారా ఆమె ఫేమస్ అయ్యారు. మరి ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఇప్పటికే సుశాంత్ మరణం అనేక మలుపులు తిరుగుతోంది. ఈ క్రమంలో అశుతోష్ భక్రే ఘటనలో ఎలాంటి నిజాలు బయటకు వస్తాయో చూడాలి.


Click it and Unblock the Notifications











