Hidimbha Twitter Review: తెలుగులోనే తొలిసారి.. హిడింబకు అలాంటి టాక్.. అశ్విన్ హిట్ కొట్టాడా అంటే!

ప్రముఖ దర్శకుడు, యాంకర్ ఓంకార్ తమ్ముడిగా సినిమాల్లోకి వచ్చినా.. విజయాలను మాత్రం పెద్దగా అందుకోలేకపోయాడు అశ్విన్ బాబు. అయినప్పటికీ అతడు వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉన్నాడు. కానీ, ఈ మధ్య కాలంలో చాలా గ్యాప్ తీసుకున్న ఈ యంగ్ హీరో.. ఇప్పుడు 'హిడింబ' అనే క్రైమ్ థ్రిల్లర్ మూవీలో నటించాడు. ఎన్నో అంచనాలను ఏర్పరచుకున్న ఈ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి దీనికి ట్విట్టర్‌లో ఎలాంటి టాక్ వచ్చింది? ఇంతకీ అశ్విన్ బాబు హిట్ కొట్టాడా? లేదా? అనేవి చూద్దాం పదండి!

హిడింబ అని వచ్చిన అశ్విన్:అశ్విన్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రమే 'హిడింబ'. అనిల్ కుమార్ కన్నెగంటి తెరకెక్కించిన ఈ మూవీలో నందిత శ్వేత హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో ఎస్వీకే సినిమాస్ బ్యానర్‌పై గంగపట్నం శ్రీధర్ నిర్మించారు. వికాస్ బాడిస సంగీతాన్ని అందించారు. మకరంద్ దేశ్‌పాండే, రఘు కుంచె కీలక పాత్రలు చేశారు.

Ashwin Babu Starrer Hidimbha Movie Twitter Review

అలాంటి కథ.. క్రైమ్ థ్రిల్లర్‌గా:హైదరాబాద్ సిటీలో వరుసగా అమ్మాయిలు అదృశ్యం అవుతుంటారు. దీనికి ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్స్‌గా చేసిన హీరో, హీరోయిన్లు కేసును ఎలా ఛేదించారు? ఈ మిస్సింగ్‌లకు హిడింబ జాతి వాళ్లకు సంబంధం ఏంటి? నరమాంస భక్షక గిరిజన జాతితో హీరో ఎలా పోరాటం సాగించాడు? అనే అంశాలతో 'హిడింబ' మూవీ తెరకెక్కింది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.

సినిమా బాగుందన్న రైటర్:'హిడింబ' చిత్రాన్ని వీక్షించిన ప్రముఖ రైటర్ గోపీ మోహన్ ట్విట్టర్‌లో 'హిడింబ మూవీ చూసి థ్రిల్ ఫీల్ అయ్యాను. నా స్నేహితుడు అనిల్ సుంకర ఈ సినిమాపై నమ్మకం నిజమైంది. కాలా బండ ఫైట్ అద్భుతంగా ఉంది. కండల మనిషి అశ్విన్ బాగా చేశాడు. నందిత శ్వేత ఎంపిక బాగుంది. అనిల్ కన్నెగంటి గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే వర్కౌట్ అయింది' అంటూ చెప్పుకొచ్చారు.

ట్విస్టులతో పాటు అవి సూపర్:అశ్విన్ బాబు నటించిన 'హిడింబ' మూవీని చూసిన మరో నెటిజన్ 'కాకినాడలో ప్రీమియర్స్‌లో హిడింబ చూశాను. సౌండ్ డిజైన్, ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్, ట్విస్టులు డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించాయి. అశ్విన్ బాబు యాక్టింగ్ అద్భుతంగా ఉంది. నందిత శ్వేత చాలా రోజుల తర్వాత మంచి రోల్ చేశారు. అనిల్ దర్శకత్వం ఎక్స్‌లెంట్‌గా ఉంది' అంటూ వెల్లడించారు.

అద్భుతంగా తీశావు అనేలా:అశ్విన్ బాబు - నందిత శ్వేత జంటగా నటించిన 'హిడింబ' మూవీ చూసిన ఇంకో నెటిజన్ ట్విట్టర్‌లో 'ఫైనల్‌గా హిడింబ మూవీకి ప్రీమియర్స్‌లో ఫైరింగ్ టాక్ వచ్చింది. ఇంటర్వెల్, క్లైమాక్స్‌లో కొన్ని సీన్స్ అయితే ఏంటి అన్నా ఇంత అద్భుతంగా తీశావు అని అనుకునేలా ఉంది. నా రేటింగ్ 3.25/5. ఈ వీకెండ్‌కు తప్పకుండా చూడాల్సిన మూవీ' అని చెప్పారు.

తెలుగులో ఎప్పుడూ రాలేదు:'హిడింబ' మూవీని చూసిన మరొక నెటిజన్ ఇలా స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో 'నిర్మాత అనిల్ సుంకర చెప్పినట్లుగా ఇలాంటి కథ తెలుగులో ఎప్పుడూ రాలేదు. ఆ సీన్స్ అన్నీ సాలిడ్‌ ఇంపాక్ట్ చూపించాయి. క్లైమాక్స్‌లో రెండు సర్‌ప్రైజ్‌లు ఉంటాయి. దాని కోసం మీరు కూడా చూడండి. హిడింబ కచ్చితంగా థియేటర్లలో చూడాల్సిన చిత్రం' అని పేర్కొన్నారు.

తెలుగులో తొలిసారిగా.. కానీ:ఇప్పటి వరకూ 'హిడింబ' మూవీ గురించి చూసిన ట్విట్లను చూస్తే.. ఈ సినిమా కథ గతంలో ఎప్పుడూ టచ్ చేయని కొత్త కోణంతో వచ్చినట్లు సుస్పష్టం అవుతుంది. అయితే, దీన్ని నడిపించిన తీరు మాత్రం కాస్త నిరాశ పరిచినట్లుగా కొందరు నెటిజన్లు చెబుతున్నారు. ముఖ్యంగా స్క్రీన్‌ప్లే కాస్త నెమ్మదిగా సాగడం సినిమాకు ప్రధాన మైనస్ అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Ashwin Babu Starrer Hidimbha Movie Twitter Review

కొత్తదనం కోసం చూడాల్సిందే:'హిడింబ' మూవీ తెలుగు సినీ చరిత్రలోనే ఎన్నడూ చూడని నరభక్షకుల కథతో తెరకెక్కింది. దీనికి తగ్గట్లుగానే విజువల్స్, ఫైట్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ సెట్ అయ్యాయని సినిమాను చూసిన వాళ్లు చెప్తున్నారు. కానీ, కమర్షియల్ హంగులు జోడించడం వల్ల సినిమా అక్కడక్కడా గాడి తప్పినట్లు అవుతుందట. మొత్తానికి కొత్తదనం కోసం ఈ సినిమాను చూడాలి అని చెప్పొచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X