తమన్నాను అందుకే తీసుకోలేదు.. విషయం బయటపెట్టిన హీరో

రాజుగారి గది ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో షకలక శంకర్, ధన్ రాజ్ కలిసి చేసిన కామెడీకి ప్రేక్షకులు ఎంతగానో పగలబడి నవ్వారు. ఆ సినిమా మంచి విజయాన్ని సాధించేసరికి సీక్వెల్‌పై దృష్టి పెట్టారు.

నాగార్జున, సమంత లాంటి స్టార్స్‌తో రాజుగారిగది 2 చిత్రాన్ని తీశారు. అయితే ఈ మూవీ అనుకున్నంతగా విజయం సాధించలేకపోయింది. మొదటి పార్ట్‌లో ఉన్న ఎంటర్‌టైన్మెంట్ రెండో భాగంలో మిస్ అయింది. దీంతో ప్రేక్షకులు కాస్త నిరాశపడ్డారు. అయితే ఇటీవలె మూడో పార్ట్‌ను కూడా సిద్దం చేశారు.

Ashwin On Tamannaah Issue In raju Gari Gadhi 3 Movie

ఈ మూవీ కూడా విడులకు సిద్దంగా ఉంది. అయితే ఈ మూడో పార్ట్‌లో మొదటగా తమన్నాను హీరోయిన్‌గా ఎంచుుకున్నారు. పూజా కార్యక్రమాలకు తమన్నా హాజరైంది. ఏమైందో గానీ అకస్మాత్తుగా తమన్నా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. అయితే ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న హీరో అశ్విన్.. ఈ విషయంపై స్పందించాడు. మొదటగా తమన్నాను హీరోయిన్‌గా సెలెక్ట్ చేశాము కానీ ఆమె డేట్స్ కుదరక పోవడంతో అవికాను తీసుకున్నట్లు తెలిపాడు. ఆ పాత్రకు అవికా న్యాయం చేసిందన్నాడు.

ఓంకార్ ఎంటర్టైన్మెంట్స్‌పై ఓంకార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రానికి చోటా కే నాయుడు సినిమాటోగ్రఫర్‌గా పనిచేస్తున్నారు. ఈ మూవీ అక్టోబర్ 18న విడుదల కానుంది. ఇటీవలె సైరా చిత్రంలో లక్ష్మీ పాత్రకు మంచి ప్రశంసలు అందుకున్న తమన్నా.. తమిళంలో తాజాగా విడుదలైన పెట్రోమ్యాక్స్‌లోనూ మంచి నటిగా గుర్తింపును తెచ్చుకుంది. తమన్నా ప్రస్తుతం పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X